HeartfulnessLogo_Blk_Pwd
హార్ట్‌ఫుల్‌నెస్ గురించి
మాతో కనెక్ట్ అవ్వండి
వ్యక్తిగత సాధన
ప్రశిక్షకునితో ధ్యాన సాధన
సామూహిక ధ్యాన సాధన
హార్ట్‌ఫుల్‌నెస్ సేవలు
కార్యకలాపాలు
హార్ట్‌ఫుల్‌నెస్ రీసెర్చ్
హార్ట్‌ఫుల్‌నెస్ మ్యాగజైన్
దాజీ ప్రసంగాలు
Jan 2023Feb 2023Mar 2023Apr 2023Jun 2023Jul 2023Aug 2023Sep 2023
దాజీ సందేశాలు
పుస్తకాలుNew
ది పవర్ ఆఫ్ పారడాక్స్Newడెస్టినీని రూపొందించడంజ్ఞాన వంతెనఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రంది హార్ట్‌ఫుల్‌నెస్ వేది హార్ట్‌ఫుల్‌నెస్ వే 2New
ఆర్ధిక సహకారం
ఆర్ధిక సహకారం

బాబూజీ మహారాజ్

1899 – 1983

babuji-master

బాబూజీ 30 ఏప్రిల్ 1899న ఉత్తర భారతదేశంలోని షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్) పట్టణంలో జన్మించారు. చిన్నప్పటి నుండి, ఆయన ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం తపనను కలిగి ఉండేవారు, అది అన్ని ఇతర ఆసక్తులను కప్పివేసింది.
ఆయన ముప్పై సంవత్సరాలకు పైగా షాజహాన్‌పూర్ జిల్లా కోర్టులో గుమస్తాగా పనిచేశారు. పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు, భార్య భగవతి, ఆవిడ 1949లో మరణించారు. ఆయన సంతానం ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు.
జూన్ 1922లో, ఇరవై రెండు సంవత్సరాల వయస్సులో, ఆయన లాలాజీని కలుసుకున్నారు, ఆయన తన వారసునిగా కొన్ని సంవత్సరాల ముందే తన కలలో కనిపించిన వ్యక్తిగా బాబూజీని గుర్తించారు.
1931లో లాలాజీ తన భౌతికశరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు గురువు శిష్యుల మధ్య చాలా తక్కువ సమావేశాలు జరిగినప్పటికీ, బాబూజీ లాలాజీ యొక్క నిరంతరమైన స్మరణలో ఉండేవారు, ఆయన అంతర్గత మార్గదర్శకత్వం లేకుండా తాను ఒక్క క్షణం కూడా జీవించలేనని చెప్పేవారు. చైతన్యపు పరిణామం అందరి జన్మహక్కు అనీ, నిజాయితీగా కోరుకునే వారికి ప్రతిచోటా ఉచితంగా అందించాలని బాబూజీ విశ్వసించారు. నిజమైన గురువు అత్యున్నత సేవకుడు అని ఆయన నమ్మారు, తన జీవితాన్ని కుల, మత, లింగ లేదా జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ సేవ చేస్తూ గడిపారు. భౌతిక, ఆధ్యాత్మిక జీవితం పక్షి యొక్క రెండు రెక్కల వలె కలిసి సాగుతుందని, ప్రేమ - త్యాగం యొక్క రెండు సద్గుణాలను తెలుసుకోవడానికి గృహస్థుని సాధారణ జీవితం ఉత్తమమైన వాతావరణం అని బోధించారు. దీని ప్రకారం, ప్రతి ఒక్కరూ ఆచరించి, ప్రయోజనం పొందగలిగేలా రాజయోగ వ్యవస్థను సరళీకరించి, పరిపూర్ణం చేసారు.
తమ తప్పులు, లోటుపాట్లను చూసి నిరుత్సాహపడవద్దని, తప్పులు మళ్ళీ పునరావృతం కాకూడదని సంకల్పించుకోవాలని తన అనుచరులను సూచించారు. వర్తమానంలోనే మనం మన ప్రవర్తనను పెంపొందించుకుంటామని, తద్వారా ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకుంటామని ఆయన వారికి గుర్తు చేశారు.
బాబూజీ స్వతఃసిద్ధంగా అత్యంత వినయశీలురు, తన గురువుపై అపారమైన విశ్వాసం కలిగి ఉన్నవారు. ప్రతి సంస్కృతి, జాతీయత చెందిన అన్వేషకులు ఆయన అందించే సరళమైన, సమర్థవంతమైన సాధనలను స్వీకరిస్తారని ఆయన విశ్వసించారు. 1972లో, హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిని, తన సహచరులైన, చెన్నైకి చెందిన శ్రీ పార్థసారథి రాజగోపాలాచారితో కలిసి యూరప్, అమెరికాకు తీసుకువెళ్లారు. పార్థసారథి, ఆయనను సహచరులు చారీజీ అని పిలుస్తారు, బాబూజీ తరువాత హార్ట్‌ఫుల్‌నెస్ సంప్రదాయంలో మూడవ గురువుగా చారీజీ ఎంపిక కాబడ్డారు.

HeartfulnessLogo_Wht_Pwd
play.pngapp.png

సామాజిక మాధ్యమాలు

  • లింక్డ్ఇన్లింక్డ్ఇన్
  • ఫేస్బుక్ఫేస్బుక్
  • ట్విట్టర్ట్విట్టర్
  • ఇన్స్టాగ్రామ్ఇన్స్టాగ్రామ్
  • వాట్సాప్వాట్సాప్

ఉపయోగకర లింకులు

  • దాజీ
  • కన్హా
  • శిక్షకులు
  • రోజువారీ ఆలోచన
  • ఆర్ధిక సహకారం

లోతుగా శోధించండి

  • హార్ట్‌ఫుల్‌నెస్ రీసెర్చ్
  • హార్ట్‌ఫుల్‌నెస్ మ్యాగజైన్

© 2026 Heartfulness - All rights reserved

నిబంధనలుగోప్యతవాపసు విధానం