Date
ధ్యానం తరువాత ధ్యానస్థితిలో ఉంటాం
దాహం వేసినప్పుడు నీళ్ళు తాగాలని, ఎప్పుడు దాహం తీరింది అని, ఎప్పుడు నీళ్ళు తాగటం ఆపాలని ఎలా తెలుస్తుంది? అదే విధంగా మన హృదయంలో ఈ పూటకి ఈ ధ్యానం చాలు అనే అనుభూతి కలుగుతుంది. మొదట్లో అలారం పెట్టుకోండి. ఒక అరగంట సమయం, అలారం మోగే వరకు, ధ్యానం నుంచి లేవకండి. మీకు ధ్యానం చెయ్యడం కొంచెం కొంచెం అలవాటు అయిన తరువాత, ధ్యానం పై పట్టు దొరుకుతుంది. ఇంత సమయం పాటు ధ్యానం చాలు అని అనుభవానికి వస్తుంది. అప్పుడు ధ్యానం నుంచి నిదానంగా, నెమ్మదిగా కళ్ళు తెరచి లేచి మిగతా రోజువారీ పనులను ధ్యానమగ్నులై చెయ్యండి. ధ్యానం తరువాత ధ్యానస్థితిలో వుంటాం. ఈ స్థితిని మనలో సంరక్షించుకుంటూ పనులు చెయ్యడంలో ఎంతో ఆనందం లభిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన “స్థిత ప్రజ్ఞత” అనే స్థితి మనలో ఏర్పడి పరిణతి చెందుతూ వుంటుంది.
ధ్యానంలో మనసు నిలవకపోవటం
ప్రతి ఒక్కరి ఇబ్బందులు వేరువేరుగా ఉంటాయి. మొట్టమొదటి అడ్డంకి నాకు ఏమి అనిపిస్తుందంటే… నేను ఏదైనా ఒక పనిని చేయకపోతే, దాన్ని గురించిన ఆలోచనలే వస్తుంటాయి. అయ్యో! చేయలేదే, చేయలేదే అనే ఆలోచనే మాటి మాటికి వస్తుంటుంది. రెండవదేమిటంటే.. నేను అది చేయవలసింది చేయలేదు, తప్పు చేసాను. ఇలాంటి నా స్థితులన్నీ ఆ సమయంలో మాటి మాటికీ ఆలోచనలుగా నా హృదయం లోకి వస్తాయి. మనం అసలేమీ మాట్లాడక పోయినా, ఎవరైనా తిడితే అది కూడా నీ హృదయం లోకి వస్తుంది. నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే అది నీ అహాన్ని తాకుతుంది. అప్పుడు అది గుర్తుకు వస్తుంది. ఇంకా ఒక్కోసారి తడబడతాము. దేని మీద ధ్యానం చేయాలి? భగవంతుడు ఎవరు? అతని గురించిన ఆలోచనే ముందుగా వస్తుంటుంది. అటువంటి సమయంలో ఈ సమస్య పరిష్కారానికి భగవంతుడిని ఇలా ప్రార్ధించాలి. “నీవు ఉన్నావో లేదో, అది కూడా నాకు తెలియదు. నీవు ఎవరివో కూడా నాకు తెలియదు. నేను నీ ఉనికిని అనుభూతి చెందాలి అని భావిస్తున్నాను”. ఈవిధంగా ప్రేమతో, గద్గద స్వరంతో గనుక మనం ప్రార్ధించినట్లైతే కొంతయినా ఫలితం ఉంటుంది. మన హృదయంలో అటువంటి భావంతో గనుక మనం ధ్యానం చేస్తే, ఎటువంటి సమస్యలు రావు.
మనసు లేదా ఆత్మతో ధ్యానం
మనం ఆత్మతో ధ్యానం చేయం. ఆత్మ ఆలోచించలేదు. శరీరం కూడా ఆలోచించలేదు. కానీ శరీరం యొక్క సహకారంతోనే నేను ధ్యానం చేయగలను. ఎలా కూర్చోవాలి? స్థిరం సుఖం ఆసనం. దేనితో సుఖంగా ఉంటుందో, అంటే దేని వలన శరీరం అసౌకర్యానికి గురికాదో, ఆ భంగిమలో కూర్చోవాలి. అంటే మెడను వెనక్కు వంచి, ఇలా కూర్చోవడం కాదు. దాని వలన మీకు నిద్ర వస్తుంది. సుఖాసనంలో కూర్చోవడం మంచిది. కుర్చీలో కూర్చుంటే, పాదాలను ఇలా ఒకదానిపై ఒకటి వచ్చేలా అమర్చి కూర్చోండి. చేతులను ఇలా జోడించాలి. ఇంత మాత్రమే శరీరం యొక్క సహకారం కావాలి. వీలైతే మెడను నిటారుగా పెట్టి కూర్చోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన తల కొంచెం వంగితే పరవాలేదు. కానీ మరీ పూర్తిగా వంగిపోవడం మంచిది కాదు. అంటే శరీరం యొక్క సహకారం కూడా మనకు కావాలి. కానీ ధ్యానం మన మనసుతో జరుగుతుంది. కొంతమంది సాధువులు మనసును శత్రువుగా భావిస్తారు. కానీ ఎప్పుడైతే మనం మనసుకు శిక్షణ ఇస్తామో, అప్పుడు దాన్ని మించిన స్నేహితుడు ఎవరూ లేరని సహజమార్గంలో మేము నమ్ముతాం. ధ్యానమంటే మనసుకు శిక్షణనివ్వడమే! ధ్యానమనేది ఎలాంటిదంటే, దానిలో మనం మన మనస్సుతో కసరత్తు చేస్తాం శారీరక శక్తి కోసం మనం యోగాసనాలు వేస్తాం. ప్రాణాయామం చేస్తాం. అలాగే మానసిక శక్తిని పెంచుకునేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ఇంకా దీనిలో ప్రాణాహుతి యొక్క సమ్మేళనం ఉంటే మన చేతనత్వం విస్తరిస్తూ ఉంటుంది, సంస్కరించబడుతూ ఉంటుంది. మేఘాలు సూర్యునికి అడ్డుగా వచ్చినప్పుడు ప్రకాశం తగ్గుతుంది కదా! అలాగే మన చైతన్యం జడంగా నల్లని మేఘం వలె ఉన్నప్పుడు ఆత్మ యొక్క ప్రకాశం వెలుపలికి రాదు. ఆత్మ ప్రకాశం దాని వరకు చేరకపోవడం వల్ల బుద్ధి మందగిస్తుంది. ఆత్మ మన మనస్సును, చేతనను, అహాన్ని ఉపయోగించుకుంటుంది. ఆత్మ మన బుద్ధిని ఉపయోగించుకుంటుంది. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ నాలుగు ధ్యానం వల్ల పవిత్రం అవుతాయి. వీటిలోని అంధకారం తగ్గుతూ ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఈ నాలుగింటిని మనం సూక్ష్మ శరీరాలు అంటాం. చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడే ఈ నాలుగింటితో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఒక సమయం ఎలా వస్తుందంటే, ఇవి కేవలం పారదర్శకమైన పరదాలవుతాయి. ఎంత పవిత్రం అవుతాయంటే, నామమాత్రంగానే పరదాలుగా ఉంటాయి. పరదా చిరిగిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది.
08-01-2023
మనసు యొక్క ఆలోచనారాహిత్య స్థితి
చాలామంది ధ్యాన సమయంలో పోరాడుతూ ఉంటారు. ధ్యాన సమయంలో అనవసర ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటారు. మీరు ఆలోచనారాహిత్య స్థితికి చేరాలనుకున్న క్షణమే… నా కన్నా ముందు మాట్లాడిన ఒక సోదరి ఎలా ఆ స్థితిని పొందాలో చెబుతూ ‘ఆలోచనారాహిత్య స్థితికి రండి’ అని చెప్పడం విన్నాను. ఆలోచనారాహిత్య స్థితికి చేరుకోవడం ఒక అందమైన లక్ష్యమే. దాన్ని ఎలా చేరుకోవాలి? మీరు తొందరగా నిద్రించాలి అనుకున్న రోజే మీకు నిద్రలోకి జారుకోవడానికి అధిక సమయం పడుతుంది. మీరు ‘నేను నా తలను దిండు పై వాల్చగానే నిద్రపోవాలి’ అని భావిస్తారు. మీరు ఎక్కువగా ప్రయత్నించే కొద్దీ, మీరు నిద్రలోకి జారుకునే సమయం ఎక్కువ అవుతుంది. అలాగే మీరు అసహనానికి గురవుతారు. మెదడును ఆలోచించకుండా ఆపడం అనేది మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మెదడు యొక్క లక్షణం ఆలోచించడమే. మనం దాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం అనేది చాలా అసహజ ప్రక్రియ. నాలుక రుచి చూడడానికి, కళ్ళు చూడడానికి ఎలాగో, ఇది కూడా అలాగే! మీరు నాలుకకు, కళ్ళకు వాటి సహజ గుణాలను పాటించవద్దని చెబుతారా? అది అలా జరగదు. కాబట్టి మీరు కొంతమేర ఆలోచనారాహిత్య మనసును పొందవచ్చు. కానీ భగవంతుడు మనకు మనసును ఒక ప్రయోజనం కొరకు ప్రసాదించాడు. సరియైన విజ్ఞతతో కూడిన ఆలోచనలు చేయడానికి! సక్రమమైన అవగాహన, సక్రమమైన ఆలోచన ఇవన్నీ మన జీవితాన్ని సుందరంగా చేస్తాయి. మనం యోగ సాధన ద్వారా మనసుకు ఒక నిర్దిష్ట రీతిలో శిక్షణ నివ్వాలి. హార్ట్ ఫుల్ నెస్ లో మనం సాధన చేసేది దీని గురించే!
కర్మఫలం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం
ధ్యానం చేసే మనస్సు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే ధ్యానాన్ని ప్రతికూల ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. రాముడు, రావణుడి కథను తీసుకొంటే… రావణుడు మంచి శివభక్తుడు, ధ్యానం చేసేవాడు అయినప్పటికీ తన శక్తులను తప్పుడు ప్రయోజనాలకు వాడుకొన్నాడు. ప్రతికూల వైఖరులు కలిగి ఉన్న వ్యక్తి ధ్యానం చేయడం కొనసాగిస్తూ ఉంటే అది అతనిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి కొందరు డిప్రెషన్ లోకి వెళ్ళే ధోరణి కలిగి ఉంటారు. కొందరు చీటికి మాటికి కోపగించుకొనే ధోరణి కలిగి ఉంటారు. ఈ ధోరణులు అన్నిటికీ ఒక మూలం ఉంటుంది. మానసిక వైద్యులు, మనస్తత్వ శాస్త్రవేత్తలకు కారణం, దాని ప్రభావం గురించిన అవగాహన ఉంటుంది. మనం కారణ తీవ్రతను కనుక తగ్గించడం లేదా తొలగించగలిగితే, ప్రభావ తీవ్రతను కూడా తొలగించవచ్చు. ఒకరకంగా మన ప్రాచీన శాస్త్రాలలో విశేషించి ఈ కారణమనేది, సంస్కారం అని నిర్వచించ బడింది. ఒక వ్యక్తి కనుక చెడు సంస్కారాలు కలిగి ఉంటే, వాటి ఫలితంగా ఏర్పడే ధోరణులు కూడా చెడుగానే ఉంటాయి. మంచి సంస్కారాలు కలిగిన వ్యక్తి జీవితం సాత్వికంగాను, సంతృప్తికరంగాను ఉంటుంది. కాబట్టి మన హార్ట్ ఫుల్ నెస్ పద్ధతిలో కారణాన్ని రద్దు చేయడం అనే ఆలోచనను చేర్చాము. అంటే, మన చర్యల ప్రభావాన్ని నిర్మూలించుకోవడం. ఇంకోవిధంగా చెప్పాలంటే మీ కర్మఫలాల ప్రభావాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోగలిగితే, అవి తమ పూర్తి సామర్థ్యంతో వ్యక్తీకరించబడవు.
యోగా అంటే సమగ్ర ఆరోగ్యం
మన భారత దేశంలో ఉన్న ప్రాచీన సంప్రదాయాలలో, సమగ్రమైన ఆరోగ్య పరిరక్షణ కొరకై యోగిక జీవన విధానంతో కూడిన ఆయుర్వేదం ఒకటి. ఇండియా కేవలం భౌతిక ఆరోగ్యం పైనే దృష్టి సారించదు. భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సాధించడమే మన దేశం లక్ష్యం. మన ప్రయత్నాలు చాలావరకు ఆ దిశగానే జరుగుతున్నాయి. అది అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంకా ఎన్నో ఆయుర్వేదం లాంటి రంగాలు కావచ్చు. ప్రపంచం అంతా, వీటన్నింటినీ సమగ్ర పరచ వలసిన ఆవశ్యకతపై మేల్కొంటున్నది. చాలామంది నన్ను ‘కమలేష్ భాయ్! మీరు అల్లోపతి వాడే వ్యక్తా? లేక హోమియోపతి వాడే వ్యక్తా?’ అంటూ ఒక వ్యక్తిగత ప్రశ్నను అడుగుతుంటారు. నేను ‘లేదు! నాకు ఏది పనిచేస్తే అది తీసుకుంటుంటాను’ అని చెప్తాను. నా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలైతే ఆయుర్వేదం వాడతాను. ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ తీసుకుంటాను. నేను మరీ అంత ఎంపిక చేసుకునే వాడిని కాను. మా నాన్నగారు ఆయుర్వేద డాక్టర్ కావటం వలన, నా చిన్నతనం నుండి ఆయన నన్ను ఫార్మసీ చదివే దిశగా ప్రోత్సహించారు. అందువలన నాకు ఈ రెండు రంగాలలో కొంతమేర అవగాహన ఉంది. నాకున్న ఆసక్తి నన్ను యోగా వైపు నడిపించింది. నా దృష్టిలో యోగా అంటే సమగ్రమైన ఆరోగ్యం. యోగా యొక్క ప్రయోజనం ఆసన, ప్రాణాయామాల ద్వారా భౌతిక ఆరోగ్యం మాత్రమే కాదు… చాలా గొప్పదైన ఆధ్యాత్మిక అంతర్దృష్టి మన లోపల స్థిరపరచుకోవడం కూడా. దాని కోసం మనం ధ్యానం చేస్తుంటాము. ధ్యానంలో చాలా పద్ధతులున్నాయి. నేను వాటన్నింటి వివరాలలోకి వెళ్లాలనుకోవటం లేదు. కానీ చేస్తున్న దాని పట్ల మీలో కొందరికి అవగాహన ఉండి ఉంటుందని నేను నిశ్చయంగా అనుకుంటున్నాను. మీరు చేస్తున్న సాధనకు ప్రాణాహుతిని, హృదయం లోకి ప్రసరించే దివ్యశక్తి ప్రవాహాన్ని జోడించమని నేను మీకు చెప్తే… మీ ధ్యానం తప్పనిసరిగా మార్పు చెందుతుంది. మనందరంభౌతిక, మానసిక, భావోద్వేగ పరమైన ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తూ బిజీగా ఉంటాం. అది గొప్పదే కానీ మనం అత్యంత ముఖ్యమైనదైన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మన శరీరానికి పోషణనివ్వటం, మనసుకు పోషణ అందించటం మనకు బాగా తెలుసు. మరి ఆత్మకు పోషణ అందించటం ఎలా? ప్రాణస్య ప్రాణః మనకు ఎక్కడ దొరుకుతుంది? నా ప్రాణానికే పోషణ నిచ్చేది! అంత గొప్ప గురువును కనుక మీరు పొందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన సేవలను అందుకుంటూ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగండి.
మానసిక ఆరోగ్యంపై చంద్రకళల ప్రభావం
నిన్న పౌర్ణమి రాత్రి. నిన్న నేను కలిసిన చాలా మంది, వారు ఎంతో విచారంగా ఉన్నట్టు తెలిపారు. ప్రతి పౌర్ణమికి ఇలాగే ఉంటుందా? అని నేను వారిని అడిగాను. వారు కాదన్నారు. కనుక పౌర్ణమి రాత్రి మన హృదయాలలో భావోద్వేగాలకు సంబంధించినంతవరకు ఏదైతే ఉంటుందో…. అది మరింత తీవ్రతరం అవుతుంది. గాఢంగా తయారవుతుంది. మీరు విచారంగా ఉంటే మీ విచారం ఎక్కువవుతుంది. అదే మీరు సంతోషంగా ఉంటే ఆ స్థితి పారవశ్యానికి దారితీస్తుంది. హింసా ప్రవృత్తులు కూడా ఆ సమయంలో మరింత ఉధృతం అవుతాయి. అలాగే సృజనాత్మకత కలిగిన వ్యక్తులు, పౌర్ణమి రాత్రి మరింత సృజనాత్మకతతో వ్యవహరిస్తారు. మన మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై చంద్రకళల పాత్ర, ప్రభావం ఆ విధంగా ఉంటుంది.
కోపం నుండి ప్రేమకు
పతంజలి యోగశాస్త్రాన్ని గమనించినప్పుడు యమ, నియమల ప్రస్తావన ఉంటుంది. యమ అనేది మనలోని వ్యతిరేకతలను నిర్మూలించడమే. నియమ అంటే సానుకూల అంశాలను పాటించడం. మన అంతరంగ పరిశుభ్రతను పెంపొందించుకోవడమే ఈ యమ, నియమల ఉద్దేశం. ఉదాహరణకు యమలో హింసను విడిచిపెట్టండి అని ఉంది. అంటే అహింసను పాటించడం. అది మీ అంతరంగ శుద్ధికి ఎలా దోహదం చేస్తుంది? మీలో ఇతరులపై హింసాత్మక ఆలోచనలు కలిగాయని ఒక్క క్షణం ఊహించండి. మీ మానసిక స్థితికి ఏం జరుగుతుంది? మీరు కొంతసేపు, ఆ భావోద్వేగం తగ్గిపోయే వరకు, కాలుష్యంతో నిండిపోతారు. కోపం అనేది ప్రేమగా ఎలా రూపాంతరం చెందాలనే విషయంపై, ఈ మధ్యనే మేము ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కోపంతో బయటకు ప్రతిస్పందించే ముందు, తక్షణం విస్పోటనం చెందేముందు… కనీసం రెండు నిమిషాలు విరామం ఇవ్వడం ద్వారా సక్రమ యోగసాధన, మీలో ప్రేమ అనే పరివర్తనను తీసుకురావడం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు అంతరంగంలో శాంతిని, ప్రశాంతతను, ఐక్యతను కాపాడుకోగలుగుతారు. ఇతరులపై కోపం తెచ్చుకోవడానికి బదులు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా, మీరు వారిపై కరుణను చూపుతారు కూడా. ఇది అద్భుతం కాదా! ఇది మీలో అంతరంగ శాంతిని నెలకొల్పడమే గాక ఎదుటివారితో కూడా ఒక చక్కని బాంధవ్యాన్ని ఏర్పరుస్తుంది. వారు మీ భార్య, భర్త, వ్యాపార భాగస్వామి లేదా మీ ఉద్యోగులు – వారు ఎవరైనా కావచ్చు.
10-01-2023
యోగనిద్ర
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.