హార్ట్‌ఫుల్‌నెస్ అనేది అనుభూతికి సంబంధించినది. మన జీవితమంతా భావనలచే, ప్రేరణలచే నడిపించబడుతుంది, ఇందులో కీలకమైనది హృదయం. మనం హృదయాన్ని ఆలకించి, ఇంకా లోపలి నుండి వచ్చే స్ఫూర్తిని సంగ్రహించగలిగినప్పుడు, మన జీవితాన్ని జయించడం (నియంత్రించడం) నేర్చుకుంటాం. హృదయంపై ధ్యానం చేయడం ద్వారా మనస్సుతో హృదయాన్ని చక్కగా తీర్చిదిద్దే సంపూర్ణ అభ్యాసం జరుగుతుంది, అందుకే దీనిని హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం అంటారు.
హార్ట్‌ఫుల్‌నెస్ అనేది 100 సంవత్సరాల నాటి సంప్రదాయం, ఇది కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూనే ఉంది, శాస్త్రీయ పరిశోధన, సమయానుకూలమైన ఆలోచనా విధానాలను ఏకీకృతం చేస్తుంది. సర్టిఫైడ్ శిక్షకులు ప్రాణాహుతి యొక్క సూక్ష్మ శక్తిని అనుభవించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తారు, ఇది అంతర్గత అనుభవం, ప్రామాణికత, కరుణ, అవగాహనను లోతైన స్థాయిలో మేల్కొల్పుతుంది. హార్ట్‌ఫుల్‌నెస్ సాధనలు మీ అవగాహనను విస్తరింపజేస్తాయి, శ్రేయస్సు, సంతృప్తి, ప్రశాంతత, కరుణ, ధైర్యం, స్పష్టతను అభివృద్ధి చేస్తాయి. ఈ మేల్కొన్న సామర్థ్యంతో, మనం కలిసి గౌరవం, శాంతి, ఐక్యత ఆధారభూతంగా ఉన్న ఒక ప్రపంచాన్ని సృష్టించగలము.
మూలాలు
1800ల చివరలో ఉత్తర భారతదేశంలోని గంగానది ఒడ్డున ఉన్న ఫతేగఢ్ అనే చిన్న పట్టణంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతి ఆవిర్భవించింది. ఈ సాధనలు ప్రాచీన కళ ఐన 'యోగిక శక్తి ప్రసారం' పై ఆధారపడి ఉన్నాయి, ఇది ఒక పరివర్తనాత్మక యోగ సాంకేతికత. తన స్నేహితులచే 'లాలాజీ' అని పిలవబడే రామచంద్ర చిన్నతనంలోనే దీనిని తిరిగి ఆవిష్కరించారు. విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించగలిగే సమర్థవంతమైన స్వీయ-సంరక్షణాత్మక పద్ధతి యొక్క అవసరాన్ని ఆయన చిన్న వయస్సులోనే గుర్తించారు.
లాలాజీ అన్ని అనవసరమైన ఆచారాలను, సాంస్కృతిక విశ్వాసాలను తొలగించి, ఆధునిక జీవిత అవసరాలకు సరిపోయే సార్వత్రిక వ్యవస్థగా ఉన్నతమైన ప్రాచీన సంప్రదాయాల నుండి అవసరమైన ధ్యాన సాధనల సమితిని సారాంశాన్ని తయారుచేసారు. ఆయన తన జీవితకాలంలో చాలా మంది అనుచరులకు శిక్షణ ఇచ్చారు. వారిలో బాబూజీ అని పిలువబడే షాజహాన్‌పూర్‌కు చెందిన రామచంద్ర కూడా ఉన్నారు. పెరుగుతున్న అనుచరులకు శిక్షణ ఇవ్వడానికి, యోగిక ప్రసారం చేసే పనిలో బాబుజీ లాలాజీకి 1945లో వారసులు అయ్యారు. ఆయన పని హార్ట్‌ఫుల్‌నెస్ సాధనల మరింత మెరుగుదలకు, పరిణామానికి దారితీసింది.
జూలై 1945లో, బాబూజీ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం లాభాపేక్ష లేకుండా భారతదేశంలో మొట్టమొదటి హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థను స్థాపించారు. ఆ తరువాత బాబూజీ విస్తృతంగా ప్రయాణించడం ప్రారంభించారు, మొదట భారతదేశంలో, ఆపై, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియాలోని ప్రజలకు ఈ సాధనలను పరిచయం చేశారు. ఆయన చేసిన యాత్రలకు 'చారీజీ' అని పిలవబడే పార్థసారథి రాజగోపాలాచారి తోడుగా ఉండి సహకరించారు. 1983లో ఆయన బాబూజీ వారసునిగా అయ్యారు. చారిజీ తరచూ విదేశాలకు వెళ్లడం వల్ల హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమం అద్భుతమైన విస్తరణకు దారితీసింది. ఆయన పాఠశాలలు, స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, పరిశోధన సౌకర్యాలు, ఉచిత ఆరోగ్య సంరక్షణ క్లినిక్‌లు, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగం (UN DPI)తో భాగస్వామ్యాన్ని కూడా అభివృద్ధి చేశారు.
దాజీ అని పిలవబడే కమలేష్ పటేల్, డిసెంబర్ 2014లో చారిజీ వారసులు అయ్యారు. 1976లో హార్ట్‌ఫుల్‌నెస్‌ని ప్రారంభించిన దాజీ, హార్ట్‌ఫుల్‌నెస్ మార్గదర్శకులు కాక ముందే భారతదేశం, USA, ఓషేనియా, ఆఫ్రికాలో సంస్థకు సంబంధించిన అనేక బాధ్యతాయుతమైన కార్యాలను నిర్వహించారు. వివాహితులైన దాజీకి ఇద్దరు కుమారులు, నలుగురు మనుమలు ఉన్నారు. ముప్పై సంవత్సరాలుగా, ఆయన న్యూయార్క్ నగరంలో ఒక వ్యాపారవేత్తగా ఫార్మసీల వ్యవస్థను అభివృద్ధి చేశారు, ఇప్పుడు అది ఆయన కుమారులు, ఇతరులచే నిర్వహించబడుతున్నది. ఆయన గొప్ప వక్త, మహోన్నత చైతన్యాన్ని కోరుకునే వారందరికీ ఆదర్శమూర్తి. ఆయన విస్తృతంగా పర్యటించారు, అన్ని వర్గాల ప్రజలతో ఇంటి వద్ద సంభాషిస్తుంటారు, యువతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఆయన మార్గదర్శకత్వంలో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హార్ట్‌ఫుల్‌నెస్ అభ్యాసీలు ఉన్నారు.
బాబూజీ మొదటిసారిగా UN సెక్రటరీ-జనరల్ డాగ్ హామర్‌స్క్జోల్డ్ ను సంప్రదించి ప్రపంచంలోని ప్రజలందరికీ శాంతి కోసం ఒక ప్రక్రియ అందించిన్నప్పటి నుండి హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమం శాంతి నెలకొల్పడంలో 1957 నుండి చురుకుగా పనిచేస్తూ ఉంది. 2005 నుండి, హార్ట్‌ఫుల్‌నెస్ 21 సెప్టెంబర్‌న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి UNతో భాగస్వామ్యం అయ్యి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అన్ని కేంద్రాలలోని స్థానిక సంఘాలకు అవగాహన కల్పిస్తుంది. నేడు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో హార్ట్‌ఫుల్ కమ్యూనికేషన్ కార్యక్రమాలు అందించబడుతున్నాయి, సంఘర్షణలను పరిష్కరించడానికి, సామరస్యాన్ని తీసుకురావడానికి ఇవి ప్రజలకు ఒక మార్గాన్ని అందిస్తాయి.
హార్ట్‌ఫుల్‌నెస్ తన మూలాలను యోగ పద్ధతిలో కలిగి ఉన్నందున, మేము జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ప్రోత్సహిస్తాము, ప్రజలకు ఉచిత కార్యక్రమాలను అందించడానికి అనేక పాఠశాలల నుండి యోగా నిపుణులందరితో కలిసి ఒక ఉచిత ఆన్‌లైన్ సహకార వేదికను సృష్టించాము.
10 మిలియన్లకు పైగా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మీరు ఇంకా దేని కోసం ఎదురు చూస్తున్నారు?