HeartfulnessLogo_Blk_Pwd
హార్ట్‌ఫుల్‌నెస్ గురించి
మాతో కనెక్ట్ అవ్వండి
వ్యక్తిగత సాధన
ప్రశిక్షకునితో ధ్యాన సాధన
సామూహిక ధ్యాన సాధన
హార్ట్‌ఫుల్‌నెస్ సేవలు
కార్యకలాపాలు
హార్ట్‌ఫుల్‌నెస్ రీసెర్చ్
హార్ట్‌ఫుల్‌నెస్ మ్యాగజైన్
దాజీ ప్రసంగాలు
Jan 2023Feb 2023Mar 2023Apr 2023Jun 2023Jul 2023Aug 2023Sep 2023
దాజీ సందేశాలు
పుస్తకాలుNew
ది పవర్ ఆఫ్ పారడాక్స్Newడెస్టినీని రూపొందించడంజ్ఞాన వంతెనఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రంది హార్ట్‌ఫుల్‌నెస్ వేది హార్ట్‌ఫుల్‌నెస్ వే 2New
ఆర్ధిక సహకారం
ఆర్ధిక సహకారం

కమలేష్ డి పటేల్

(1956 – ప్రస్తుతం)

kamlesh-d-patel

దాజీగా అందరికీ సుపరిచితమైన ఆయన, హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానంపై వీరి బోధనలు ఆయన వ్యక్తిగత అనుభవం నుండి ఉద్భవించినవే కాకుండా అదే సమయంలో ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలు, శాస్త్రీయ పురోగతి పట్ల ఆయనకున్న లోతైన విచారణను, గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి…
1956లో గుజరాత్‌లో జన్మించిన దాజీ, తొలినుండే ధ్యానం, ఆధ్యాత్మికతపై ఆసక్తిని ప్రదర్శించారు. పందొమ్మిదేళ్ల వయసులో ఫార్మసి చదువుతున్నప్పుడు హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ప్రారంభించారు. వెంటనే, తన మొదటి గురువు, హార్ట్‌ఫుల్‌నెస్ పరంపరలోని రెండవ మార్గదర్శి ఐన బాబూజీని కలుసుకున్నారు. అహ్మదాబాద్‌లోని L.M. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుండి ఆనర్స్‌తో పట్టా పొందిన తరువాత, దాజీ వివాహం చేసుకుని న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అక్కడ, ఆయన, తన భార్య వారి ఇద్దరు కుమారులను పెంచారు, విజయవంతమైన ఫార్మసీ వ్యాపారాన్ని స్థిరంగా నిర్మించారు. అదే సమయంలో, బాబూజీ వారసులైన చారీజీకి అంకితమైన శిష్యునిగా ధ్యానంపై తన ప్రేమను దాజీ కొనసాగించారు. గడచిన సంవత్సరాలుగా, సంస్థాగతంగా, ఇంకా హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమ సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా, ఆ పద్ధతిని బోధించడం ద్వారా ఆ ఉద్యమంలో దాజీ చురుకైన పాత్ర పోషించారు. 2011లో, చారిజీ దాజీని తన ఆధ్యాత్మిక వారసునిగా ఎంచుకున్నారు.
హార్ట్‌ఫుల్‌నెస్ ఉద్యమ నాయకునిగా, దాజీ ఇప్పుడు ఒక ఆధునిక గురువు యొక్క అనేక విధులను నెరవేరుస్తున్నారు, విస్తృతంగా ప్రయాణించి, ప్రతిచోటా సాధకులకు తన మద్దతును అందజేస్తారు. ఆచరణాత్మక స్వీయ-నిర్వహణ సాధనాలతో, సార్వత్రిక విలువలతో నేటి యువతను సుసంపన్నం చేయాలని దాజీ దృఢంగా విశ్వసిస్తారు. ఆయన మార్గదర్శకత్వంలో, 2,500 పైగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులు, అధ్యాపకులు ఇప్పుడు విలువ-ఆధారిత స్వీయ-అభివృద్ధి కార్యక్రమాల పోర్ట్‌ఫోలియో నుండి ప్రయోజనం పొందుతున్నారు.
ఆధ్యాత్మికతపై స్వీయ-అభిమానం కలిగిన విద్యార్థిగా, దాజీ తన సమయాన్ని, శక్తిని ఆధ్యాత్మికత - చైతన్యం రంగంలో తన వ్యక్తిగత పరిశోధనకు వెచ్చిస్తారు. బహిరంగ ప్రసంగ కార్యక్రమాలలో, తన వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ప్రసరణలలో, ముద్రణ, డిజిటల్ మీడియా ద్వారా క్రమం తప్పకుండా తన పరిశోధనలను పంచుకుంటారు. దాజీ యొక్క కథనాలు హఫింగ్టన్ పోస్ట్, చికాగో ట్రిబ్యూన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ స్టాండర్డ్‌తో సహా పలు ప్రముఖ ప్రచురణలలో ముద్రించబడ్డాయి. దాజిగారి రేడియో సిటీ స్వరణ్ సిరీస్, దిల్ కి ఆవాజ్, పన్నెండు ఎపిసోడ్‌ల పాటు నడిచి, మంచి ఆదరణ పొందింది.
పురాతన సంప్రదాయాన్ని ఆధునిక శాస్త్రీయ అవగాహనతో కలపడాన్ని దాజీ సమర్థిస్తారు. ధ్యానం, యోగ ప్రసారం యొక్క శారీరక, జన్యు ప్రభావాలను పరిశోధించడానికి వంద మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేశారు. శాస్త్రీయ పద్దతితో ఆధ్యాత్మికతను సమీపించడాన్ని - ఈ రంగంలో తన స్వంత అనుభవం, నైపుణ్యం నుండి ఉద్భవించిన ఆచరణాత్మక విధానాన్ని ఆయన విశ్వసిస్తారు. "మీరే ప్రయోగకర్త, ప్రయోగం మీరే, దాని ఫలితం కూడా మీరే", అని దాజి తరచుగా చెప్తారు.
హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఇంటికి అందుబాటులో ఉండాలనేది దాజీ కోరిక. ఆయన మార్గదర్శకత్వంలో, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థలు 130 దేశాల్లోని వేలకొద్దీ హార్ట్‌స్పాట్‌లు, రిట్రీట్ సెంటర్‌లలో ఉచిత ధ్యాన శిక్షణను అందిస్తాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ కోసం 'లెట్స్ హార్ట్‌ఫుల్‌నెస్' యాప్ ద్వారా వ్యక్తిగత, సామూహిక ధ్యానం కోసం వ్యక్తిగతంగా లేదా రిమోట్‌గా హార్ట్‌ఫుల్‌నెస్ ప్రశిక్షకులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నారు.
దాజీ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి సందర్శించండి http://www.daaji.org/

HeartfulnessLogo_Wht_Pwd
play.pngapp.png

సామాజిక మాధ్యమాలు

  • లింక్డ్ఇన్లింక్డ్ఇన్
  • ఫేస్బుక్ఫేస్బుక్
  • ట్విట్టర్ట్విట్టర్
  • ఇన్స్టాగ్రామ్ఇన్స్టాగ్రామ్
  • వాట్సాప్వాట్సాప్

ఉపయోగకర లింకులు

  • దాజీ
  • కన్హా
  • శిక్షకులు
  • రోజువారీ ఆలోచన
  • ఆర్ధిక సహకారం

లోతుగా శోధించండి

  • హార్ట్‌ఫుల్‌నెస్ రీసెర్చ్
  • హార్ట్‌ఫుల్‌నెస్ మ్యాగజైన్

© 2026 Heartfulness - All rights reserved

నిబంధనలుగోప్యతవాపసు విధానం