సరిగ్గా రాత్రి 9:00 గంటలకు, ఈ ప్రార్ధన చేయాలనుకునే ప్రతీ ఒక్కరూ, ఆ సమయంలో వారు ఎక్కడ ఉన్నా, తమ కార్యకలాపాలను ఆపి, సోదర, సోదరీమణులందరూ ప్రేమతో, భక్తితో నింపబడుతున్నారని, నిజమైన విశ్వాసం వారిలో బలంగా పెరుగుతోందని భావిస్తూ పదిహేను నిమిషాలు ధ్యానం చేయవచ్చు. ఇది వారికి అపారమైన మేలు కలుగజేస్తుంది, అది వారి ఆచరణాత్మక అనుభవం మాత్రమే వెల్లడిస్తుంది.
విశ్వ ప్రార్థన
ప్రతిరోజూ చేసే ఈ హార్ట్‌ఫుల్‌నెస్ విశ్వ ప్రార్థన, ప్రజలందరి సంక్షేమం కోసం అంకితం చేయబడింది. ఈ ప్రార్థనను ప్రతీరోజు రాత్రి స్థానిక సమయం 9 గంటలకు చేస్తాము.
మేము ఈ ప్రార్థనను స్థానిక సమయం, రాత్రి 9 గంటలకు సమర్పిస్తాం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మనలో చాలామంది దీనిని ఆచరిస్తున్నప్పుడు, ప్రతీరోజు 24 గంటలూ మొత్తం మానవాళి యొక్క ఆధ్యాత్మిక సంక్షేమం కోసం ప్రార్థనలు నిరంతరంగా అందించబడుతూంటాయి. ఈ విశ్వ ప్రార్థనలో కలవమని అందరినీ ఆహ్వానిస్తున్నాము.
ప్రపంచంలోని వివిధ భాషలలో రాత్రి 9 గంటల విశ్వ ప్రార్థన.