మీ ఉద్యోగులు లేదా సహచరులకు పని చేసే స్వేచ్ఛనివ్వండి, అప్పుడు వసంతకాలపు పువ్వులాగా వికసించటాన్ని చూడండి.
మీరు ప్రేమతో మాత్రమే హృదయాలను గెలుచుకోగలరు. వేరే మార్గం లేదు.
మనం హృదయం చెప్పేది వినినప్పుడు, ఎంపికలు చేసేందుకు విస్తారమైన మానసిక ప్రక్రియ అవసరం లేదు. మనకు ఏది సరియైనదో ఎల్లప్పుడూ తెలుస్తుంది.
ఎవరు తమను తాము అర్హులుగా తయారు చేసుకుంటారో, వారి కొరకు కృప కదలి వస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ తమను తాము తయారు చేసుకొనుట అతి ముఖ్యమైన అంశం.
విధేయత అంటే, తనపై పులి దాడి చేస్తున్నప్పటకీ, తన తల్లి ఒడిని చేరుటకై పరిగెత్తే పసిపిల్లవాడి స్థితి వంటిది.
ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే బదులు, ఇతరులను గౌరవించడం పట్ల దృష్టి సారిద్దాం.
హృదయం యొక్క సంకేతాలతో ప్రగాఢమైన శ్రుతి కలిగి ఉండు.
దాపరికం లేని హృదయమున్నప్పుడు, ప్రతిఒక్కరు మీకు మిత్రులవుతారు.