ధమనులు, సిరల ద్వారా మనస్సు, తల నుండి పాదాల వరకు శరీరమంతటా ప్రవహిస్తుంది. అది స్థిరపడిన చోట ఆనందాన్ని, అక్కడ నుండి బలవంతంగా తొలగించబడినప్పుడు బాధనూ అనుభూతి చెందుతాం.
లాలాజీ
January 30th 2025
క్రమశిక్షణ, ప్రాపంచిక మోహమనే హీనత్వాన్ని సరిచేస్తుంది, హృదయాన్ని ధర్మ సిద్ధాంతాలతో దృఢపరుస్తుంది, మనస్సును ప్రయోజనకరమైన జ్ఞానంతో కాంతివంతం చేస్తుంది, స్వీయ అంతరంగం నుండి ఆనందాన్ని సమకూర్చుతుంది .
లాలాజీ
January 29th 2025
జీవితాన్ని సరళీకరించుట మరియు అవసరాలపై దృష్టి నిలుపుట గురించి తెలిపేదే ఆధ్యాత్మిక ప్రగతి.
దాజీ
January 28th 2025
ముడి చెక్కకు, అవసరమైన రూపం కూర్చడం తేలిక. అప్పటికే వస్తువుగా రూపం సంతరించుకున్న చెక్కకు, ఇంక వేరే రూపం కూర్చడం అసాధ్యం.
బాబూజీ
January 27th 2025
నిరంతరంగా ఇతరులకు ఇచ్చేవారికి, ఎన్నటికీ లేమి ఉండదు.
చారీజీ
January 26th 2025
హార్ట్ఫుల్నెస్ ధ్యానసాధన చేయడమంటే వ్యక్తి, తన హృదయాంతరాళంలో కేంద్రీకృతమై, అక్కడ నిజమైన జీవిత అర్థాన్ని, సంతృప్తిని కనుగొనడం.
దాజీ
January 25th 2025
ఒక అభ్యాసి మనస్సులో కల్లోలం నెలకొన్నప్పుడు, దాని శక్తి అతనికి సమస్యలను సృష్టిస్తుంది. దానిని నిలువరించుటకు ప్రాణాహుతి శక్తి ప్రవహిస్తుంది.
బాబూజీ
January 24th 2025
నీవు ఏ ఉద్దేశ్యంతో సృష్టించబడినావని ఎన్నడూ ప్రశ్నించకు - దాన్ని కనుగొని, నెరవేర్చడానికి ప్రయత్నించు.
చారీజీ
January 23rd 2025
ప్రశాంతత లేకుండా సృజనాత్మకంగా ఉండలేము.
దాజీ
January 22nd 2025
మన చైతన్యాన్ని విస్తరించినపుడు, మత పరిధులను దాటి ఆధ్యాత్మికపథంలోకి అడుగు పెడతాము.
బాబూజీ
January 21st 2025
హృదయము సరియైనప్పుడు, మనస్సు మరియు హృదయాల మధ్య పరిపూర్ణమైన సామరస్యం ఎల్లప్పుడు ఉంటుంది.
దాజీ
January 20th 2025
యథార్థమైన ప్రేమలో, కేవలము ప్రేమ మాత్రమే ఉండి, ప్రేమికుడు మరియు ప్రియుడు దానిలో లయమవుతారు.
దాజీ
January 19th 2025
నిన్ను నీవు మార్చుకో! నువ్వు మారితే తప్ప, ఇతరులను మార్చలేవు.
చారీజీ
January 18th 2025
ధ్యానం యొక్క నాణ్యత మన వైఖరి పై ఆధారపడి ఉంటుంది; కాలవ్యవధి పై కాదు.
దాజీ
January 17th 2025
మన ప్రవర్తన పట్ల శ్రద్ధ వహించడం అంటే వాస్తవానికి మనం ప్రకృతి సారూప్యతతో ఉండే విధంగా, సమతుల్య స్థితిని సిద్ధింపచేసుకోవడమే.
లాలాజీ
January 16th 2025
నీకు ధ్యానించడానికి సమయం లేనప్పుడు, అదే నీవు ధ్యానించుటకు తగిన సమయం.
దాజీ
January 15th 2025
ఆత్మపరిశీలనతోనే జ్ఞానం వృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. కాని దీనికి సమయం ఎవరికి ఉంది? ఎవరైతే శ్రద్ధను అభివృద్ధి చేసుకుంటారో, వారికే అందుకు సమయం దొరుకుతుంది.
బాబూజీ
January 14th 2025
ఒక ప్రయత్నం సజీవమైనదిగా ఉండి, వైభవవాన్ని పెంపొందించేలా చేసేది ఏది?.
అది వైఖరి మరియు ఆసక్తి. విజయంలో 95 శాతం వాటా వైఖరిదే .
దాజీ
January 13th 2025
మనం ప్రపంచాన్ని మార్చబోవటం లేదు. కాని మనం మారినప్పుడు, ప్రపంచమే మారుతుంది.
చారీజీ
January 12th 2025
మీ ఆలోచనావిధానం సరైనదా, కాదా, ఉపయోగకరమైనదా, కాదా, అని అంచనా వేయడానికి ధ్యానం మీకు సహాయపడుతుంది.
దాజీ
January 11th 2025
మీ అలవాట్లు మరియు ప్రవర్తన మీరు ఎక్కువగా కలిసిఉంటున్న వ్యక్తుల ద్వారా ప్రభావితమవుతాయి
లాలాజీ
January 10th 2025
కోరికల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛను పొందితే ఏమి జరుగుతుంది? అటువంటి హృదయాలు కృతజ్ఞతతో నింపబడ గలవు.
దాజీ
January 9th 2025
శ్రేష్ఠతను నీ నుండే ఆశించు, ఇతరుల నుండి కాదు.
దాజీ
January 8th 2025
ప్రేమా, భక్తి సులభమైనవే అయినప్పటికీ, వాటిని ఒక్కసారిగా సిద్ధింపజేసుకోవడం చాలా కష్టం.
బాబూజీ
January 7th 2025
నీ హృదయంలో ప్రేమ అని పిలువబడే మహాసముద్రమున్నది. దాని తాళంచెవి నీ చేతిలోనే ఉన్నది.
దాజీ
January 6th 2025
ధర్మాచరణ అనేది నిర్భయంగా, ధైర్య, శౌర్యాలతో ఆచరించే కర్మ.
లాలాజీ
January 5th 2025
ప్రేమతో ప్రియమైన వారికి స్వేచ్ఛనివ్వండి. పంజరం నుండి ఎగిరిపోయే పక్షి కూడా వెనుకకు మరలి వస్తుంది.
చారీజీ
January 4th 2025
స్వచ్ఛమైన మనస్సు కేంద్రీకృతమై ఉన్నందున, అంతరంగం నుండే దిశానిర్దేశం పొందగలదు.
దాజీ
January 3rd 2025
మితత్వం ప్రకృతి యొక్క స్వభావం. పూర్తి మితత్వం పొందినప్పుడు, మనం ప్రకృతికి అనుగుణమైన మార్గంలో ఉన్నట్లే. ఆధ్యాత్మికసారం అదే.
బాబూజీ
January 2nd 2025
జీవితంలో ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండుటవల్ల, మన అంతర్గత వనరులను అత్యుత్తమంగా వినియోగించబడి, మనం ఒక స్థాయికి చేరవచ్చు.
దాజీ
January 1st 2025
ఎవరికీ హాని చెయ్యకుండా సహజరీతిలో జీవితాన్ని వ్యక్తం చేయాలి.