అందరికోసం నీ హృదయాన్ని తెరచి ఉంచగల ధైర్యాన్ని కలిగిఉండు.
చారీజీ
November 26th 2024
మనం ఏమి చేసినా, అహంకారానికి లోనుగాకుండా, ఉన్నతంగా తయారుకావాలి.
దాజీ
November 25th 2024
ఒక వ్యక్తి గమ్యం చేరడానికి పరుగెడితే, మరొకరు నడుచుకుంటూ గమ్యాన్ని చేరుతాడు, భేదం ఏమిటి ? ఒకరు సమయాన్ని ఆదా చేస్తే, మరొకరు సమయాన్ని ఖర్చు చేసారు.
బాబూజీ
November 24th 2024
సాధన మరియు అనుభవం ద్వారా, కొనసాగటానికి అవసరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం సహజంగానే పెంపొందించుకుంటాం.
దాజీ
November 23rd 2024
ప్రాణాహుతి, పరివర్తనకు ఒక క్రియాశీలకమైన ఉత్ప్రేరకం.
దాజీ
November 22nd 2024
ప్రేమ సఫలతను బాహ్యపరమైన వ్యక్తీకరణలో ఆశించక, మీ హృదయం లోపల ఆశించండి.
చారీజీ
November 21st 2024
మీరు ధ్యానం చేయలేని రోజున, దాన్ని కోల్పోయినట్లు భావిస్తారా?
దాజీ
November 20th 2024
హృదయమే మనస్సు యొక్క కార్యక్షేత్రం.
దాజీ
November 19th 2024
ఆత్మపరిశీలన వలన వివేకం వృద్ధి చెందుతుంది అనేది వాస్తవం, కానీ అందుకు సమయం ఎవరికున్నది? ఎవరైతే ఆసక్తిని పెంచుకుంటారో వారికే సమయం దొరుకుతుంది.
బాబూజీ
November 18th 2024
క్రమశిక్షణ అనేది అంతరంగంలో నుండి రావాలి, కాని బాహ్యపరంగా విధింపబడరాదు.
దాజీ
November 17th 2024
మీ శత్రువులను, మీరు భయపడే వ్యక్తులను స్నేహితులుగా చేసుకోండి. ఇతరులు మీ పట్ల ఏమి చేయడాన్నిమీరు ఇష్టపడరో, దాన్నిఇతరుల పట్ల చేయకండి.
లాలాజీ
November 16th 2024
పరివర్తన మార్పును కోరుతుంది. అభివృద్ధి మార్పును కోరుతుంది.
దాజీ
November 15th 2024
పక్షి బంగారు పంజరంలో సంతోషంగా ఉండవచ్చు, కానీ ఆ పంజరం ఎప్పటికీ దాని స్వంతం కాదు అని గుర్తుంచుకోవాలి.
దాజీ
November 14th 2024
మన విధి రూపకల్పనకు సరైన ప్రకంపనాక్షేత్రాన్ని సృష్టించుకొనుటలో సమభావము, కేంద్రీకరణ, ఉత్సాహం విజయాన్ని చేకూర్చే మార్గాలు.
దాజీ
November 13th 2024
అంతులేని ఆలోచనా ప్రవాహం కేవలం ధ్యాన సమయంలోనే కాక అనుక్షణం కొనసాగుతుంది. మనస్సును క్రమబద్ధీకరించక పోవడం చేత, అది వాటితో కలిసి కదలడం ప్రారంభించి, అన్ని విధాలైన సమస్యలను, ఆటంకాలను సృష్టిస్తుంది.
బాబూజీ
November 12th 2024
సేవ చేస్తున్నామన్న భావనతో కూడిన సేవకు, సత్యతత్వం అందుబాటులో ఉండదు. సేవ తాలూకు ముద్రలు ఏర్పడని విధంగా అందించిన సేవకు మాత్రమే అది దొరకుతుంది.
బాబూజీ
November 11th 2024
ఎదగడానికి, మనలను మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోవడానికి - వివాహం మనందరికీ అవకాశాలను ఇస్తుంది.
దాజీ
November 10th 2024
అహాన్ని ఇతరులను బాధపెట్టడానికి వాడకూడదు; 'సరే, నేను ఇంతకు మునుపు చేసినదానికన్నా బాగా చేయగలను' అని చెప్పి నా వైపు తిరిగి వేలు చూపిస్తూ ఉండాలి.
దాజీ
November 9th 2024
ఎదిగే పిల్లలు మొక్కలవంటి వాళ్ళు - వారి ఎదుగుదలకు ప్రేమ మరియు సూర్యరశ్మితో పాటు స్వేచ్ఛ కూడా అవసరం.
చారీజీ
November 8th 2024
భూమ్మీద జీవితం పరిణామం కొరకే. ప్రతి జీవితం వివేకం, నైపుణ్యాలు, వైఖరులలో పరిణామమే.
దాజీ
November 7th 2024
ఎవరి వాక్కు సభ్యత, మర్యాద, నాగరికతతో కూడి ఉంటుందో, అటువంటి వారు విశాలమైన, నిర్మలమైన, ఉదాత్తమైన హృదయం కలిగి ఉంటారు.
లాలాజీ
November 6th 2024
మనస్సులో నుండి గతం తాలూకు ముద్రలను తొలగించుకొనుట ద్వారా, మార్పును అంగీకరించి, మన విధిని రూపకల్పన చేసుకుంటాము.
దాజీ
November 5th 2024
ఏ క్షేత్రంలోనైనా విజయం సాధించే బాధ్యత మనపైనే ఉంటుంది. మీపట్ల మీకుగల బాధ్యతపట్ల అప్రమత్తతతో అవగాహన కలిగి ఉండండి.
దాజీ
November 4th 2024
ఎవరైనా ఒక వివేకవంతుణ్ణి, అవివేకి అంటే, అతడు తన అవివేకాన్ని బయటపెట్టినట్లే.
బాబూజీ
November 3rd 2024
ఆధ్యాత్మికతలో ప్రయోగమూ నీవే, ప్రయోగకర్తవూ నీవే, మరియు ప్రయోగ ఫలితమూ నీవే.
దాజీ
November 2nd 2024
ప్రేమలో ఆశకు చోటు లేదు, కానీ కృతజ్ఞతకు మాత్రం ఉంటుంది. అందుకే ప్రేమ మానవ ఉదాత్తతకు పరాకాష్ట.
దాజీ
November 1st 2024
ఖచ్చితమైన విజయసాధనకు, తీవ్రమైన కాంక్ష, సరైన సాధనాలు, దృఢసంకల్పంతో కూడిన ప్రయత్నాలు అవసరం.