(శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ్య దాజీ 29 ఆగష్టు 2021న ఆదివారం ఉదయం 7 గంటల ధ్యానం తరువాత ఇచ్చిన ప్రసంగం)

నమస్తే జీ!హ్యాపీ జన్మాష్టమి!గీతా బోధలు సనాతనమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. అవి మనలో ఏదో ఒక రకంగా ప్రేరణలు కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రేరణలు ఎంత ఉత్కృష్టమైనవైనప్పటికీ, సాధకులు వేటినైతే సాక్షాత్కరించుకోవాలని తపిస్తున్నారో, ఆ దిశగా తరువాతి అడుగు వేయలేకపోతున్నారు. మన ఆచార్యులు, ఎంతో కీర్తిని పొందిన మన బోధకులెందరో, మనం చేరుకోవలసిన ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞత్వం అని నిస్సందేహంగా చెప్పారు. నిజమే! అలాగే మనిషి తాను చేస్తున్న కర్మకు, నిజానికి ఆతను కర్త కాడని కూడా చెప్పడం…

ప్రేమ పరిపూర్ణమై భక్తిగా మారాలి

అందరికీ నమస్కారం! గత సాయంత్రం ఎంతో అద్భుతమైన, మైమరపించే ప్రదర్శనను మనం తిలకించాం. గొప్ప నైపుణ్యాత్మకమైన ప్రదర్శన! ఫ్లూట్ వాయిద్యపు కళా కోవిదుని గొప్ప ప్రదర్శన! చిన్న పిల్లవానిగా ఆయన ‘రాగ్ యమన్’ ఫ్లూట్ పై నేర్చుకున్నా, 50 సంవత్సరాల పైగా ఇప్పటికీ అదే రాగాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. స్వరాలు కొన్నే అయినా సాధన ఎంతో. మనం ఆనంతం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ స్వరాలు అనంతం! ఆధ్యాత్మిక అన్వేషకుడు ప్రతిక్షణం ఇంకెంత సాధన చేయాల్సిన అవసరం…

మూలము గా తయారవడం

Daaji’s talk 9th March 2019 ధ్యానం ద్వారా మన స్వీయ ప్రగతి లేదా పరిణామం గురించి తరచుగా ఆందోళన చెందుతాము. మనం నిజంగా ప్రగతి చెందుతున్నామా లేదా అని కూడా తరచూ అర్థం చేసుకోలేము. మరికొంతమంది తమకేమీ తెలియకపోయినా తామెంతో సాధించామని సాధికారికంగా అనుకుంటారు. ఇది కొంతమంది వ్యక్తులలో పెద్ద వ్యత్యాసాన్నే చూపిస్తుంది. నేను ఇదివరకు చెప్పిన గుర్రాల ఉదాహరణలో బాగా పెంచబడిన గుర్రాలు, సాధారణ గుర్రాలు మరియు ఎంతకీ కదలని గుర్రాలు అని మూడు…

జీవితంలో మనం చేసుకొనే ఎంపికలు.

Pujya Daaji’s talk on 8/3/2019 జీవితంలో మనం చేసుకొనే ఎంపికల గురించి నేను నిన్నటి నుండి ఆలోచిస్తూ ఉన్నాను. మన స్వీయ ఎంపికలు తరచుగా మనలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటాయి. మనం చేసుకొనే ఉత్తమ ఎంపికలు, పెద్ద, పెద్ద విషయాలు మన జీవితంలో మార్పుకు దోహదం చేస్తాయని మనం భావిస్తూ ఉంటాము. అయితే మనం తీసుకొనే చిన్న నిర్ణయాలే, చిన్న విషయాలే మార్పుకు దోహదం చేస్తూ ఉంటాయి. సందర్భం ఏదయినప్పటికీ, ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే మనం…

కాన్హా వైద్య కేంద్రము

ప్రపంచ అతి పెద్ద ధ్యాన కేంద్రం హార్ట్ ఫుల్ నెస్ ప్రధాన కార్యాలయం కాన్హా శాంతివనం.ఇది హైదరాబాద్ శివార్లలో నిర్మించబడి, సహజమార్గ ధ్యానసాధన ద్వారా తన సేవలను అందిస్తున్న సంగతి మనందరికీ విదితమే.హార్ట్ ఫుల్ నెస్ సాధనలు యోగాకు ఆధునిక రూపాలు.ఇవి సంతృప్తి, అంతర్గత ప్రశాంతత, నిశ్చలత, కరుణ, ధైర్యం, స్పష్టమైన ఆలోచనలను అందించడంలో తోడ్పడుతాయి.ఇప్పుడు మన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ అత్యాధునిక వసతులతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. దీని ద్వారా హార్ట్…

అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

ఇది 24 మార్చి 1945న పూజ్య లాలాజీ మహరాజ్ నుంచి వచ్చిన సందేశం. పూజ్య లాలాజీ బాబూజీతో ఇలా అంటున్నారు, “నీకు ఇవ్వడానికి ఇక నా దగ్గర ఏం మిగిలి ఉంది?”ఇంకొకసారి చదువుతున్నాను… “ఇప్పుడిక నీకు ఇవ్వడానికి, నా దగ్గర ఏం మిగిలి ఉంది?”ఇది ఒక విధమైన ఆవేదన, బాధతో తన శిష్యునితో ‘ఇక నా వద్ద ఏమీ మిగల్లేదు ప్రియతమా’ అని చెప్పడం లాంటిది. నేను మీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినట్లుగా, నిజమైన గురువు మిమ్మల్ని…

దిల్ సే విత్ దాజీ 04 మార్చి 2022 జూమ్ సమావేశం నుండి.

భగవంతునితో అనుబంధం ప్రేమతో ముడిపడి ఉండాలి. ప్రశ్న: ప్రణామ్స్ మాస్టర్!! ప్రారంభంలో ఇష్టదేవత పై ధ్యానిస్తూ, క్రమేణా నిరాకార పరబ్రహ్మము పై ధ్యానించాలని శ్రీరామకృష్ణ పరమహంస బోధించేవారు. మన హార్ట్ ఫుల్ నెస్ విధానంలో ధ్యానం, రూప రహితంగా, హృదయంలో దివ్యజ్యోతి ఉందనే భావన మాత్రమే. నేను నిత్యం పూజ, ధ్యానం, సంధ్యావందనం ఇత్యాదులు చేస్తాను. ఈ రెండు వైరుధ్యాల మధ్యా నేనెలా ముందుకు వెళ్లాలో సూచించగలరు? దాజీ: నా జీవిత పర్యంతం, శ్రీ రామకృష్ణ పరమహంసని…

ప్రేరణ పొందండి -25

సంతుష్టికి దారితీసే సాధనలు సంతుష్టి, సంతోషాలకు దారితీసే సాధనలుకోరికలు, కాంక్షలతో మనకుండే అనురాగాన్ని తొలగించుకున్నప్పుడే మన అంతరంగలో ఆవశ్యకమయిన స్వీకారం (యాక్సెప్టెన్స్), సంతృప్తి లేదా సంతుష్టి (కంటెంట్‌మెంట్) లను సృష్టించుకోగలమని క్రిందటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.అయితే ఇదెలా సాధ్యం?హార్ట్ఫుల్నెస్ విధానంలో ఇది సహజంగా ఆచరణీయమైన, పరిపూరకమైన పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది. ఇవి నాలుగు ఉన్నాయి.మొదటిది, ధ్యానం. ఈ సాధన ద్వారా ఆలోచనల ఆకర్షణను అలక్ష్యం చేయడం నేర్చుకుంటాం. అవి ఇక ఎంతమాత్రమూ మనలను అన్యమనస్కం చేయలేవు.మన ఆలోచనా…

ప్రేరణ పొందండి -24

సంతృప్తిని కలిగించేవి ఏవి? మనం ఆత్మతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు సంతుష్టంగా ఉంటామనీ, సంతుష్టి, మనసు నుండిగాని, శరీరం నుండి గానీ లభించదనీ, దాని జన్మస్థానం ఆత్మ అనే విషయాన్ని ఇంతకు క్రితం తెలుసుకున్నాము.ఇప్పుడు మనం ఆ సంబంధాన్ని అనుభూతి చెందటానికి సహకరించే సాధనల గురించి పరిశీలిద్దాం. ఈ సందర్భంగా, ప్రాచీన యోగ పితామహుడైన పతంజలి యోగ సూత్రాలను తెలుసుకుందాం వాటిని ఆయన వేల సంవత్సరాల క్రితం రాసి నప్పటికీ, ఇప్పటికీ అవి విలువైనవి, వర్తిస్తాయి.స్వచ్ఛత ->సంతుష్టి…