అహంకారం అనేది నిజమైన విషయమేమీ కాదు.
చాలామంది చీకటిని నిందిస్తారు.
వెలుగును ప్రశంసిస్తారు.
కానీ మీకు వెలుగు లేనిదే చీకటి యొక్క ప్రాముఖ్యత తెలియదు.
అంధకారం ఎప్పటికీ అలాగే ఉంటుందా!
కానీ సృష్టి యొక్క సహజ స్వభావం అదే!
ఈ విశ్వం లేనప్పుడు ఏముందో ఊహించుకోండి. సృష్టి ఇంకా జరగలేదు
అంటే వెలుగును ప్రసరించే సూర్యుడు, నక్షత్రాలు ఏమీ లేవు.
కాబట్టి ఈ సృష్టి అభివ్యక్తీకరణ ముందు విశ్వం యొక్క నిజ స్వభావం
అంధకారమే. వెలుగు చాలా తరువాత వ్యక్తమైంది.
మనం మన అహంకారం గురించి మాట్లాడేటప్పుడు,
ఈ అహం అనేది అసలు ఉందా!
లేదు. అహం అనేది మన అవగాహనారాహిత్యమే.
ఎలాగైతే వెలుగు లేకపోతే అంధకారం ఉంటుందో
అలాగే సక్రమమైన అవగాహన లేకపోవడమే అహంకారం.
మనకు అవగాహన లేనప్పుడు,
అన్ని రకాల పొరపాట్లు చేస్తాము.
ఈ అవగాహనారాహిత్యంలో ఏదైనా మంచి జరిగితే
అది యాదృచ్ఛికమే.
కానీ మనం నిరాశపడవలసిన అవసరం లేదు. చాలామంది యోగులు
మనసును నిందిస్తూ “మనస్సే ప్రధాన శత్రువు” అంటారు.
మన మనసు మన అధీనంలో లేకపోతే
ప్రధాన శత్రువు కాగలదు.
మనకు మన మనసును ఎలా నియంత్రించాలో తెలియనప్పుడు,
అది సమస్యగా మారుతుంది.
మనం మన అహాన్ని మచ్చిక చేసుకోవచ్చు
అలాగే దాన్ని మన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు.
మీకు క్రీడలలో, సంగీతంలో ఇలా ఆసక్తి ఉండవచ్చు.
మీరు నిన్న ఆట బాగా ఆడారు. కానీ మీరు నిన్నటి ఆటతో సంతృప్తి పడతారా?
మీరు దానిని అధిగమించాలనుకుంటారు. అవునా?
మిమ్మల్ని మీరు అధిగమించిన తరువాత మీరు ఒక ఛాంపియన్ తో ఆడతారు.
నేను ఆమె కంటే మెరుగ్గా ఉన్నాను అని ప్రకటిస్తారు.
తరువాత నా కంటే ఎవరూ మెరుగ్గా లేరు
అని ప్రకటించుకుంటారు.
ఇప్పుడు అహం అనేది వేరే విధంగా
వ్యక్తమవడం మనం చూడవచ్చు.
నేను నిన్నటి నా కంటే మెరుగవుతాను
అనుకోవడం స్వాభిమానం.
నేను నా వృత్తిలో మెరుగ్గా రాణిస్తాను అని
భావించడం ఆత్మగౌరవం.
‘ఎవ్వరూ నాకంటే మెరుగ్గా లేరు’ అని ప్రకటించడం
అహంకారం, గర్వం. ఇది అహానికి గల మరో దశ.
ఒకరు అహాన్ని తమ ప్రయోజనానికి ఉపయోగించుకుని
‘నేను ఒక ఉత్తమ ఆటగాడిగా తయారవుతాను…
ఉత్తమ సంగీతకారుడిగా తయారవుతాను లేదా నేను నా వృత్తిలో
ప్రావీణ్యతను పొందుతాను’ అని భావించవచ్చు.
కానీ గర్వంతో ఎవరూ నాకంటే మెరుగ్గా లేరు
అని ప్రకటించడమే సమస్య.
కాబట్టి అహాన్ని గురించి మనం కంగారు పడవలసిన అవసరం లేదు.
దానిని మన ప్రయోజనానికి ఉపయోగించుకుంటూ వెళ్లడమే.
అలాగే ప్రేమ విషయంలో కూడా! మనం ప్రేమను, అహాన్ని అనుసంధానించవచ్చు.
నేను ఒకరిని ఎవ్వరూ ప్రేమించనంతగా ప్రేమిస్తాను అని భావించవచ్చు.
మనం ఎందుకు అలా చేయడం లేదు?
మనం మన మాతృమూర్తిని ఎవ్వరూ ప్రేమించనంతగా ప్రేమించవచ్చు.
కాబట్టి మనం అహంకారాన్ని సకారాత్మకంగా
ఉపయోగించుకోవచ్చు.
కానీ మీరు చాలా ప్రతికూల భావనతో గొప్పలు చెప్పుకుంటూ,
నేను చెప్పిందే చెయ్యండి లేదా ఒప్పుకోను అని అనడం వల్ల…
మీకు మీరు ప్రేమించే వారికి మధ్య అహం దెబ్బతినవచ్చు.
మీరు వారి శత్రువులుగా మారతారు.
మానసిక భావాలను ఎలా ఉపయోగించుకోవడమనేది
మన చేతుల్లోనే ఉంది.
మనం వాటితో సంబంధాలను నిర్మించవచ్చు లేదా నాశనం చేయవచ్చు.
అహంకారం అనేది కత్తి వంటిది.
కత్తితో కూరగాయలు కోసి రుచికరమైన వంట చేయవచ్చు.
అలాగే దానితో ఎవరినైనా చంపవచ్చు కూడా. అహంకారం కూడా అలాంటిదే.
అందుకే మనకు ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నాయి. ప్రపంచాన్ని
త్యజించడం సులభమే.
మీరు సన్యాసిలా తయారవడం సులభతరమే
కానీ మీ అహాన్ని త్యజించడం… ఇది అందరికీ సాధ్యం కాదు.
కుటుంబజీవనంలో మనం మన కోరికలను త్యాగం చేస్తాము.
మనం మన గర్వాన్ని, అహంకారాన్ని దిగమింగుతాము.
అందుకే కుటుంబజీవనం మనం ఒకరినొకరు
ప్రేమించడానికి ఒక శిక్షణా కేంద్రం వంటిది.
మనం అప్పుడు భగవంతుడిని
ప్రేమించడానికి అర్హులమవుతాము.
కుటుంబ జీవనం మనం అభ్యాసం చేయటానికి
ఒక క్రీడారంగం వంటిది.