ప్రపంచ అతి పెద్ద ధ్యాన కేంద్రం హార్ట్ ఫుల్ నెస్ ప్రధాన కార్యాలయం కాన్హా శాంతివనం.
ఇది హైదరాబాద్ శివార్లలో నిర్మించబడి, సహజమార్గ ధ్యానసాధన ద్వారా తన సేవలను అందిస్తున్న సంగతి మనందరికీ విదితమే.
హార్ట్ ఫుల్ నెస్ సాధనలు యోగాకు ఆధునిక రూపాలు.
ఇవి సంతృప్తి, అంతర్గత ప్రశాంతత, నిశ్చలత, కరుణ, ధైర్యం, స్పష్టమైన ఆలోచనలను అందించడంలో తోడ్పడుతాయి.
ఇప్పుడు మన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ అత్యాధునిక వసతులతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. దీని ద్వారా హార్ట్ ఫుల్ నెస్ తన సేవలను కేవలం సాధకుల కోసమే కాకుండా, ఈ కాన్హా పరిసర ప్రాంతవాసులకు కూడా అందించడం కోసం సిద్ధమైంది.
ఈ సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ మార్గదర్శి అయిన దాజీ గారు కాన్హా వైద్య కేంద్రము లో వైద్య విధానాల గురించి వివరించారు.
దాజీ మాట్లాడుతూ… “మనలో కొంతమంది ఎందువల్లనో కేవలం ఆత్మ చైతన్యం,
మానసిక వికాసం మనిషికి సరిపోతాయని భావిస్తారు.
మనలో ఎంతోమంది సమయాభావం వల్ల వీటిని పట్టించుకోరు
ఆరోగ్యం అనేది అత్యంత ఆవశ్యకం.
దురదృష్టవశాత్తు మీకు అనారోగ్యం కలగడం సంభవిస్తే…
మన కాన్హా గ్రామం అలాగే పరిసర గ్రామాలకు, అధునాతన వైద్య వసతులు, సదుపాయాలు లేనందువల్ల…
మన గౌరవనీయ వైద్య, ఆరోగ్య శాఖామాత్యుల సమక్షంలో అటువంటి ఆసుపత్రిని ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది.” అని దాజీ అన్నారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు విచ్చేశారు. వీరితో బాటు ఇతర ప్రముఖులు అయిన మెదక్ ఎం.ఎల్.ఏ. శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు, కొల్హాపూర్ ఎం.ఎల్.ఏ. శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రాజ్ గార్లు కూడా పాల్గొనడం విశేషం. ఇది శ్రీ తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడడం ఎంతో హర్షణీయం.
ప్రారంభోత్సవం సందర్బంగా శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ, ” హార్ట్ ఫుల్ నెస్ సంస్థకు తన ఆరోగ్య, శ్రేయస్సు కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం అందించడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాలు తమ నైతిక విలువలు మరియు ప్రమాణాల దృష్ట్యా జాతీయంగానే కాక అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందగలవు. దాజీ మార్గదర్శకత్వంలో నిరుపయోగ ప్రయోగాలు అనేవి లేకుండా అన్నీ సత్సాంప్రదాయాలు నెలకొల్పబడతాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకు తెలంగాణా ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియచేస్తున్నాను. ప్రభుత్వ సహకారం అవసరం లేకుండానే ఇప్పటికే ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ దిగ్విజయంగా కొనసాగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. వైద్య సహాయం అవసరమైన నిరుపేదలకు కూడా సరైన తోడ్పాటును అందించగలమని పూజ్య దాజీ ప్రకటించడం కూడా నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది.”
హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి శ్రీ కమలేష్ పటేల్(దాజీ) ప్రసంగిస్తూ, “ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అమెరికా నుంచి మేము ఎన్నో వైద్య పరికరాలను దిగుమతి చేసుకున్నాం.
ఎంతో మంది దాతలు, వదాన్యులు దయతో ఉదారంగా
ఎన్నింటినో సమకూర్చారు.
ఈ కాన్హా వైద్య కేంద్రాన్ని రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాలనేది నా కల.
అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఇవన్నీ అందరికీ తెలుసు. కొన్నిటి గురించి మనకు అంతగా పరిచయం ఉండదు.
ఉదాహరణకి నిద్రలేమి సమస్య ఉన్నవారు మన అభ్యాసీలే కానక్కరలేదు… వారందరికీ చికిత్స పొందడానికి స్వాగతం.
వారందరూ ఈ పొలారిటీ చికిత్స నేర్చుకోవడానికి స్వాగతం. అలాగే క్వాంటమ్ హీలింగ్… నయం కాని రోగాలకు ఇది మరొక చికిత్స.
ఇక్కడ అందించే అన్ని చికిత్సలూ ముఖ్య పద్ధతులైన అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి లకు ప్రత్యామ్నాయం కాదు.
మన సాంప్రదాయ వైద్య విధానాలతో మనం విభేదించటం లేదు.
మీ డాక్టర్ మందులను వాడమంటే అదే చేయండి. దాంతో పాటు దీన్ని కూడా ఉపయోగించి ప్రయోజనాన్ని పొందండి.” అని దాజీ అన్నారు
హృదయ పూర్వక సేవలందించే సంస్ధలలో ఒకటిగా నున్న హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా మరిన్ని ఉత్తమ ఆరోగ్య సేవలు అందించే ప్రయత్నమే ఈ హార్ట్ ఫుల్ నెస్ మెడికల్ సెంటర్.