అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

ఇది 24 మార్చి 1945న పూజ్య లాలాజీ మహరాజ్ నుంచి వచ్చిన సందేశం. పూజ్య లాలాజీ బాబూజీతో ఇలా అంటున్నారు, “నీకు ఇవ్వడానికి ఇక నా దగ్గర ఏం మిగిలి ఉంది?”
ఇంకొకసారి చదువుతున్నాను… “ఇప్పుడిక నీకు ఇవ్వడానికి, నా దగ్గర ఏం మిగిలి ఉంది?”
ఇది ఒక విధమైన ఆవేదన, బాధతో తన శిష్యునితో ‘ఇక నా వద్ద ఏమీ మిగల్లేదు ప్రియతమా’ అని చెప్పడం లాంటిది.

నేను మీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినట్లుగా, నిజమైన గురువు మిమ్మల్ని తన కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు.
తనకన్నా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన అభిలషిస్తారు.
ఈ క్రమంలో ఇది మనకెన్నో విషయాలు విశదీకరిస్తుంది.
గురువర్యుల మానసిక, హృదయాంతరాల లోతులను, ఉన్నత స్థితులను అలాగే మనపై వారు పని చేసే విధానాన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు?

ఈ పరిజ్ఞానం లేదా ఇటువంటి ఎరుక మనకు లేనప్పుడు, వారికి పూర్తిగా శరణాగతులవటమే మనం చేయవలసింది.
ఇటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో అసంపూర్ణ విధానాలు మేలు చేయవు.

వారెప్పుడూ వారి దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువే ఇవ్వాలనుకుంటారు.
‘నా ప్రియ శిష్యునికి ఇంకా నేనేమి ఇవ్వగలను?’ అని వారు ఎప్పుడూ ఆవేదన చెందుతారు.
మన అందరి కోసం వారు పడే వేదన అలా ఉంటుంది.
కాబట్టి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం!

నేను ఇప్పటివరకూ చూసిన దాని ప్రకారం, మన వైపు నుంచి ఏమైనా అవసరమైనది అంటూ ఉంటే, అది మనం మధ్యలో జోక్యం చేసుకోకపోవడమే!
తెరచిన హృదయంతో మనం ఉండాలి.
ఏమాత్రం చెదరకుండా ఉండగలగాలి.
అయితే మన జోక్యం అన్ని విషయాలలో అధికంగానే ఉంటుంది.

అందువల్ల ఆధ్యాత్మిక బీజం ఏదైతే మొలకెత్తవలసి ఉంటుందో అది మొలకెత్తదు.
మన కారణంగానే జరగవలసినది జరగదు.
ప్రాణాహుతి, కృప అంతా నిండి ఉందని చెప్తారు కదా!
తెరచిన హృదయానికే కదా అంతా లభించేది!
హృదయం యొక్క లక్షణం ఏమిటి – గ్రహించడం…
బృహదారణ్యకోపనిషత్తు లో – సంస్కృతం లో ఉన్న విషయం మీకు చెప్పాను కదా…
హృదయం యొక్క నిర్వచనం ఇచ్చారు…
హృ – ద – య…
హృ – అంటే, ఆకర్షించడం…
ద – అంటే, తిరిగి ఇవ్వడం… ఇచ్చిపుచ్చుకోవడం… నేను తీసుకుంటాను, తిరిగి అందరికీ ఇస్తాను, పంచుతాను..
అప్పుడే అది వృద్ధి చెందుతుంది…
అప్పుడే మనకు ఉన్నత స్థితులతో సంబంధం ఏర్పడగలదు…
ఈ ఇచ్చిపుచ్చుకోవడం లోనే మనకు ఉన్నత స్థితులతో సంబంధం ఏర్పడుతుంది.
మీరే చేసి చూడండి!

Share this post