సంతుష్టి
అలవాట్ల నిర్మూలన, సృష్టి భాగం 8
పూజ్యదాజీ అలవాట్లను ఉన్నతంగా ఎలా మలచుకోగలమో వివరిస్తూ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ, యోగిక సూత్రాలు, సాధనలతో పాటు పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగ విధానాన్ని కూడా మన దృష్టికి తీసుకువస్తున్నారు. ఇంతకు మునుపు మొదటి నియమం అయిన స్వచ్ఛత (శౌచ) గురించి మనకు తెలియజేసారు. ఇప్పుడు అతిముఖ్యమైన మానవీయ లక్షణం, ‘సంతుష్టి’ గురించి తన ఆలోచనలను ఆయన మనతో పంచుకుంటున్నారు. యోగిక పరిభాషలో దీనిని ‘సంతోష్’ అంటారు.
సంతోషం కోసం మన అన్వేషణ
అన్ని సంస్కృతీ సంప్రదాయాలలో అనాదిగా మనిషి మనుగడ మంచిగా కొనసాగుతుందని చెప్పడానికి గీటు రాళ్ళుగా సంతుష్టి, సంతోషం, శ్రేయస్సు అనే లక్షణాలను వర్ణించడం జరిగింది. ఈ నాటి అనిశ్చిత ప్రపంచంలో ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా ఇవి మనకు అందని ఫలాలుగానే మిగిలిపోయాయి. భారత దేశంలోని తాతలు, అమ్మమ్మలను గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకు అంత పెద్ద ఆస్తులేమీ లేవు, సాధారణమైన జీవనం గడిపేవారు. ఇంకా, బ్రిటిష్ పరిపాలన చివరి రోజుల్లో, భారత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వాళ్ళు గడ్డు కాలాన్ని చవిచూసారు కూడా. అయినా సరే చాలామంది ఐశ్వర్యవంతులు కూడా చవిచూడని సంతృప్తిని అత్యున్నతస్థాయిలో వాళ్లనుభవించారు. వారి సాధారణ జీవనశైలి, వారి మొహంలో తాండవించే చిరునవ్వులు, కుటుంబసభ్యులతో కలిసి జీవించిన తీరు, వాళ్ళ మనుగడను నిర్వచించే ప్రాథమికమైన సూత్రాలు. ఈ సూత్రాలు వాళ్ళలో సుస్థిరతను కలిగించాయి.
ఎదురైన పరిస్థితులు ఎంతటివయినా సరే తమ మనుగడను మాత్రం చక్కగా తీర్చి దిద్దుకున్నారు.
1977 సంవత్సరంలోని ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే సినిమా దీనికి మంచి ఉదాహరణ. యూదు-ఇటలీ జాతీయులకు పుట్టిన పుస్తకాల దుకాణం యజమాని కథ ఇది. అతడ్ని నాజీలు బాధించి ఖైదులో వేస్తారు. అప్పట్లో అతడు తన పిల్లవాడిని ఏవిధంగా రక్షించినది మరియు ఆనాటి భయానకమైన కాన్సెంట్రేషన్ కాంప్ జీవితం గురించి ఆశ, హాస్యంతో వాడికి కళ్ళకు కట్టినట్లు వివరించే చిత్రం అది.
ఆవిధంగా మనిషి సంతుష్టి చెందడం అన్నది వాళ్ళ వాళ్ళ పరిస్థితుల మీద ఆధారపడలేదని, అది అంతరంగ స్థితితో ముడిపడి ఉందని గ్రహిస్తాం. (అంటే, మన సంతృప్తి, మన అంగీకరించే స్థాయి లేదా కాంక్షించే స్థాయితో సమానంగా ఉంటుంది.)
మనం ఆత్మతో సంపర్కం కలిగి ఉన్నప్పుడు కూడా సంతుష్టంగా ఉంటాం. ఈ విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. సంతుష్టి, మనసు నుండిగాని, శరీరం నుండి గానీ లభించదు, దాని జన్మస్థానం ఆత్మ. అక్కడ నిబంధనలు, నమ్మకాలు, షరతులు, అలవాట్ల పొరలన్నీ కరిగిపోతాయి.
https://cdn-prod.heartfulness.org/e-magazines/telugu/HFN_MAG_AUG21_TELUGU.pdf