జీవితంలోని రంగులన్నింటినీ స్వాగతించడమే హోలీ!
హోలీ మన జీవితాల్లో ఉత్సాహం, ఆనందం, ఆశ, ఆకాంక్ష, ఐక్యత, దాతృత్వం, పరివర్తన అనే ఏడు రంగులను కలుగజేసే ఒక పండుగ. ఈ సప్తవర్ణాల శోభితం వల్లే మనం ఈ పండుగను ప్రేమోత్సవం, రంగుల పండుగ లేదా వసంతోత్సవం అని కూడా పిలుచుకుంటాం. మరి ఈ పండుగ ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? ప్రాచీన భారతీయ గ్రంథాల ప్రకారం, రాక్షస రాజు హిరణ్యకశిపుని సోదరి హోలిక, బాలుడైన ప్రహ్లాదుని చంపడం కోసం ఉద్దేశించబడిన అగ్నిలో, ఈరోజునే దహించబడిందని…