September-23

సహజమార్గ గురుపరంపర నమస్కారం.జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి మనందరికీ గొప్ప సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆయన యోగ పురుషుడు మాత్రమే కాదు, యుగ పురుషుడు, యోగేశ్వరుడు, యోగానికి భగవానుడు కూడా. సహజమార్గపు ఆదిగురువు అయిన లాలాజీ మహరాజ్… శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో, పూజ్య భావంతో, గౌరవంతో, అమితంగా ప్రేమించేవారు. ఆయన భారత దేశపు చరిత్ర లోని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్నంతటినీ శోధించి… శ్రీకృష్ణుడు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంగా ఆకాశంలో ఉండడాన్ని కనుగొన్నారని తమ గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అలాగే…