చేసే పనిలో అంకితభావం
ఒత్తిడికి సంబంధించిన ప్రశ్నకి తిరిగి వస్తే, ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఒత్తిడి లేని జీవితాన్ని ఎలా గడపాలి? నేను ఫార్మసీ వ్యాపారం చేసే రోజుల నుండి, మళ్లీ మీకొక ఉదాహరణను ఇవ్వాలనుకుంటున్నాను. 1984 లో అమెరికాలోని న్యూయార్క్ సిటీ, బ్రూక్లిన్ లో మొదటి ఫార్మసీని తెరిచాను. మావద్ద ఇంటర్న్ షిప్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ఫార్మసీని ప్రాక్టీస్ చేయాలనుకునే వారు. ఫార్మసీని తెరవడానికి లైసెన్స్ పొందాలంటే, ఒక సంవత్సరంలో 2 వేల గంటలు…