ప్రేమ పరిపూర్ణమై భక్తిగా మారాలి

అందరికీ నమస్కారం! గత సాయంత్రం ఎంతో అద్భుతమైన, మైమరపించే ప్రదర్శనను మనం తిలకించాం. గొప్ప నైపుణ్యాత్మకమైన ప్రదర్శన! ఫ్లూట్ వాయిద్యపు కళా కోవిదుని గొప్ప ప్రదర్శన! చిన్న పిల్లవానిగా ఆయన ‘రాగ్ యమన్’ ఫ్లూట్ పై నేర్చుకున్నా, 50 సంవత్సరాల పైగా ఇప్పటికీ అదే రాగాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. స్వరాలు కొన్నే అయినా సాధన ఎంతో. మనం ఆనంతం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ స్వరాలు అనంతం! ఆధ్యాత్మిక అన్వేషకుడు ప్రతిక్షణం ఇంకెంత సాధన చేయాల్సిన అవసరం…