(శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ్య దాజీ 29 ఆగష్టు 2021న ఆదివారం ఉదయం 7 గంటల ధ్యానం తరువాత ఇచ్చిన ప్రసంగం)

నమస్తే జీ!హ్యాపీ జన్మాష్టమి!గీతా బోధలు సనాతనమైనవి. కాలపరీక్షకు నిలిచినవి. అవి మనలో ఏదో ఒక రకంగా ప్రేరణలు కలుగజేస్తాయి. దురదృష్టవశాత్తు ఆ ప్రేరణలు ఎంత ఉత్కృష్టమైనవైనప్పటికీ, సాధకులు వేటినైతే సాక్షాత్కరించుకోవాలని తపిస్తున్నారో, ఆ దిశగా తరువాతి అడుగు వేయలేకపోతున్నారు. మన ఆచార్యులు, ఎంతో కీర్తిని పొందిన మన బోధకులెందరో, మనం చేరుకోవలసిన ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞత్వం అని నిస్సందేహంగా చెప్పారు. నిజమే! అలాగే మనిషి తాను చేస్తున్న కర్మకు, నిజానికి ఆతను కర్త కాడని కూడా చెప్పడం…

ప్రేమ పరిపూర్ణమై భక్తిగా మారాలి

అందరికీ నమస్కారం! గత సాయంత్రం ఎంతో అద్భుతమైన, మైమరపించే ప్రదర్శనను మనం తిలకించాం. గొప్ప నైపుణ్యాత్మకమైన ప్రదర్శన! ఫ్లూట్ వాయిద్యపు కళా కోవిదుని గొప్ప ప్రదర్శన! చిన్న పిల్లవానిగా ఆయన ‘రాగ్ యమన్’ ఫ్లూట్ పై నేర్చుకున్నా, 50 సంవత్సరాల పైగా ఇప్పటికీ అదే రాగాన్ని సాధన చేస్తూనే ఉన్నారు. స్వరాలు కొన్నే అయినా సాధన ఎంతో. మనం ఆనంతం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడ స్వరాలు అనంతం! ఆధ్యాత్మిక అన్వేషకుడు ప్రతిక్షణం ఇంకెంత సాధన చేయాల్సిన అవసరం…