అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

ఇది 24 మార్చి 1945న పూజ్య లాలాజీ మహరాజ్ నుంచి వచ్చిన సందేశం. పూజ్య లాలాజీ బాబూజీతో ఇలా అంటున్నారు, “నీకు ఇవ్వడానికి ఇక నా దగ్గర ఏం మిగిలి ఉంది?”ఇంకొకసారి చదువుతున్నాను… “ఇప్పుడిక నీకు ఇవ్వడానికి, నా దగ్గర ఏం మిగిలి ఉంది?”ఇది ఒక విధమైన ఆవేదన, బాధతో తన శిష్యునితో ‘ఇక నా వద్ద ఏమీ మిగల్లేదు ప్రియతమా’ అని చెప్పడం లాంటిది. నేను మీకు ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినట్లుగా, నిజమైన గురువు మిమ్మల్ని…