దిల్ సే విత్ దాజీ 04 మార్చి 2022 జూమ్ సమావేశం నుండి.
భగవంతునితో అనుబంధం ప్రేమతో ముడిపడి ఉండాలి. ప్రశ్న: ప్రణామ్స్ మాస్టర్!! ప్రారంభంలో ఇష్టదేవత పై ధ్యానిస్తూ, క్రమేణా నిరాకార పరబ్రహ్మము పై ధ్యానించాలని శ్రీరామకృష్ణ పరమహంస బోధించేవారు. మన హార్ట్ ఫుల్ నెస్ విధానంలో ధ్యానం, రూప రహితంగా, హృదయంలో దివ్యజ్యోతి ఉందనే భావన మాత్రమే. నేను నిత్యం పూజ, ధ్యానం, సంధ్యావందనం ఇత్యాదులు చేస్తాను. ఈ రెండు వైరుధ్యాల మధ్యా నేనెలా ముందుకు వెళ్లాలో సూచించగలరు? దాజీ: నా జీవిత పర్యంతం, శ్రీ రామకృష్ణ పరమహంసని…