తామరాకు వంటి స్థితి
తామరాకు వంటి స్థితి మీతో ఇప్పుడు నేను పంచుకోవాలనుకుంటున్న మూడవ చిట్కా కిదే సరైన తరుణం. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన మూడవ చిట్కాను పూర్తిగా గుర్తు చేసుకోలేక పోతున్నా. ఇది తామరాకు వంటి స్థితి గురించి, ఆయన గొప్పగా వర్ణించారు అలాగే ఎంతో వ్యాఖ్యానం కూడా చేశారు. బురద నిండిన సరస్సులో ఉన్నప్పటికీ, తామరాకు ఎటువంటి ముద్రలను ఏర్పరుచుకోదు. దీన్ని మనం ఎలా గ్రహించాలి? ఈ సందేశం కూడా సంస్కారాల గురించే. ఇది సంస్కారాలు ఎలా ఏర్పడతాయో…