నేను సిద్ధంగా ఉన్నాను!!

జీవితంలో ఊహించని మార్పులను ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో ‘స్పీకింగ్ ట్రీ’ లో వారు రాసిన ఒక వ్యాసంలో పూజ్య దాజీ విశదీకరించారు. ఆ వ్యాస సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సెంటర్డ్ నెస్ (కేంద్రంలో స్థిరంగా ఉండటం)

ప్రియమైన మిత్రులారా, ఏ ఆధ్యాత్మిక సాధన ధ్యేయమైనా స్థితప్రజ్ఞ స్థితిని సాధించడమే; అంటే సృష్టికి పూర్వం ఉన్న సమత్వ స్థితిని పోలి ఉండే  స్థితి అన్నమాట. అసలు ఈ  ‘సమత్వ స్థితి’ అంటే ఏమిటి? భౌతిక స్థాయిలో వస్తువు  యొక్క గురుత్వ  కేంద్రానికి (సెంటర్ ఆఫ్  గ్రావిటీ) ఆధారం ఉంటే వస్తువు సమతౌల్య స్థితిలో ఉంటుంది. ఆ కేంద్రం  ఆధారాన్ని కోల్పోతే, వ్యవస్థ ఆ  సమత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. జీవితంలో సమత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే మన  దృష్టిని…