బాబూజీ గురించి…
ప్రియ మిత్రులారా, ఇదంతా 1976లో, నాకు ఇరవై యేళ్ళ వయస్సు వస్తున్నప్పుడు మొదలైంది. ఏమంత చెప్పుకోదగ్గ పురోగతి లేకుండా నేను ధ్యానం చేస్తూండడాన్ని గమనించిన నా కాలేజీ మిత్రుడు ఒకడు నన్ను ఒక మహిళ దగ్గరికి తీసుకు వెళతాను; ధ్యానంలో తక్షణమే మైమరపు స్థితికి చేరుకునేందుకు ఆమె నీకు సహాయపడుతుందని చెప్పాడు. అతని సలహా నాకు ఎంతగానో నచ్చి, అతడితో వెళ్లాను. మొదటిసారి ధ్యానానికి కూర్చొన్న నాకు, జీవితంలో కలిగిన అత్యంత ఆశ్చర్యకరమైన అనుభవం అదే. నేను…