మనం సాధారణంగా ప్రిసెప్టర్ నుంచి ముఖాముఖి సిట్టింగ్స్ తీసుకుంటాం. కానీ హఠాత్తుగా మీరు మీ కార్యాలయంలోనో, మీ తోటి పనిచేసే వారితోనో, కస్టమర్లతోనో మాటల మధ్యలో ధ్యానం గురించి ప్రస్తావన వస్తే, వారికి ధ్యానం మీద ఆసక్తి వుంటే, మీ మొబైల్ ఫోన్ ద్వారా హార్ట్ఫుల్నెస్ యాప్ ని ఉపయోగించవచ్చు. ఆ యాప్ ద్వారా ప్రిసెప్టర్ తో జత కలిపి అతనికి ఆ క్షణమే రిమోట్ సిట్టింగ్ తీసుకునే అవకాశం కలిగించవచ్చు. మీరు ప్రిసెప్టర్ కాదు అని, సమయం లేదని చింత పడవలసిన పనిలేదు.
‘పొలారిటీ’, ఇది కూడా మీరు వారికి నేర్పవచ్చు. ఏదైనా అనారోగ్యంతో బాధపడే మీ కుటుంబసభ్యులకి పొలారిటీ బాగా నిద్రపోవడానికి మేలు చేస్తుంది. మీరు ఇప్పటికే పొలారిటీ టెక్నిక్ ని ట్రైనింగ్ సెషన్ లో నేర్చుకున్నారు. దీన్ని మీ కుటుంబ సభ్యులకి నేర్పండి. ఉదాహరణకి మీకు ఏ రోజైనా నిద్రపట్టకపోతే, మీ భార్యని లేక భర్తని ఈ పొలారిటీ మీ మీద ప్రయోగించమని కోరవచ్చు. మీరు ఐదు నిముషాల్లో నిద్రలోకి జారుకుంటారు. గురక పెట్టడం మొదలు పెడతారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారు, వింటున్నవారిని ధ్యానంతో పాటు పొలారిటీ గురించి నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. పొలారిటీకి ధ్యానమయ మనస్సు తోడైతే, అది మరింత మెరుగ్గా పనిచేస్తుంది.
నా స్వానుభవంలో నాకు అప్పుడపుడు నిద్రపట్టడం కష్టంగా వుంటే, ఒక నెలలో ఒకటి, రెండు సార్లు నిద్రపట్టదు. ధ్యానం చేసినా, కళ్లు మూసుకొని రెండు, మూడు గంటలు వున్నా ఒక్కోసారి రాత్రి రెండు గంటల వరకు నిద్ర పట్టదు. నేను చాలా తాజాదనం అనుభూతి కలిగివున్నా కూడా, నిద్ర అయితే శరీరానికి అవసరం. ఎందుకంటే పొద్దునే హుషారుగా వుండాలి. మనసుకి కొంత తాజాదనం అవసరం.
ఇలా నిద్ర పట్టనప్పుడు, నేను ఎవరో ఒకరిని నేరుగా కానీ, రిమోట్ గా కానీ, పొలారిటీ విధానాన్ని నా మీద ప్రయోగించమని కోరుతాను. నిద్రలోకి జారుకోవడానికి పొలారిటీ నాకు బాగా సహాయపడుతుంది. పొలారిటీ మీకు కూడా బాగా ఉపయోగపడుతుందని నాకు గట్టి నమ్మకం. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ పొలారిటీ ఎలా ఉపయోగపడుతుందో తెలుపుతాను.
మీ ప్రియమైన వారెవరైనా ఆసుపత్రిలో గానీ ఐసియులో గానీ వున్నా లేదా మీ ఇంటిలో ఎవరైనా అనారోగ్యంతో వున్నా, ఈ పొలారిటీ ప్రక్రియ రోగి త్వరగా కోలుకోవడానికి చాలా సహాయపడుతుంది. నేను చాలా రోగుల విషయంలో ఇది గమనించాను. క్యాన్సర్ తో బాధపడుతున్నవారు ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ క్యాన్సర్ అనే పదమే ఎవరిలోనైనా ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ విషయంలో పొలారిటీ చాలా శాంతిని చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను.
ధ్యానం వలన అనారోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలు, వాటి సంస్కారాలు తొలగిపోతాయి. కానీ పొలారిటీ మనలోని శక్తిని సమస్థితికి చేరుస్తుంది. పొలారిటీ చికిత్స మనలోని తేజస్సు లేదా ప్రాణమయ కోశం మీద ప్రభావం చూపిస్తుంది.
వివిధ సంస్థలలో మనం అందించే శిక్షణలో ఇవి చేర్చండి. ఇందులో పొలారిటీ ఒకటి. ధ్యానం, అంతఃకరణ శుద్ధి (నిర్మలీకరణ). హార్ట్స్ యాప్ – ఈ యాప్ ని డౌన్లోడ్ చెయ్యడం. యాప్ ని ఉపయోగించడం, ప్రాక్టికల్ గా యాప్ ని ఎలా ఉపయోగించాలో చూపించడం. ఇందుకు అరగంట సమయం కేటాయించండి.
హార్ట్ఫుల్నెస్ మాగజైన్ ని డౌన్లోడ్ చేసి అందులోని కొన్ని గొప్ప వ్యాసాలను అందరితో పంచుకోవడం. ఈ మాగజైన్ లోని కొన్ని వ్యాసాలు మీరు మీ పిల్లలతో పంచుకోవాలి అనేంతలా మీ హృదయానికి హత్తుకుంటాయి.
యాభై, అరవై వ దశకాలలో నేను పిల్లవాడిని. నా పసితనంలో మా నాన్న మాకు కథలు చదివి వినిపించే వారు. ఇక్కడ నేను కథలు అంటే నిద్రపోయేటప్పుడు చెప్పే కథలు కాదు. ఇంటికి ఏదైనా పత్రిక వస్తే చాలు, ఆయన అందులోని విషయాలను అందరికీ వినిపించేలా పెద్దగా చదివేవారు. అందులో ఒకటో, రెండో నాకు నచ్చినవి తలకెక్కేవి.
పిల్లలకి జోకులు బాగా ఇష్టంగా ఉంటాయి. అవి చాలాకాలం వారి మదిలో నిలిచివుంటాయి. పిల్లలను ఎప్పుడూ బోధలు, ఉపదేశాలతో విసిగించకండి. వారికి పత్రికలలో వుండే వినోదం, హాస్యం కలిగించే జోకులని, కథలని వినిపించండి.
మీకు ధ్యానంలో కలిగిన అనుభవాలని పిల్లలతో పంచుకోండి. ఇది వారిలో స్ఫూర్తిని, ప్రేరణని కలిగిస్తుంది. మీరు, మీ పిల్లలూ మీ మీ ఫోన్లతో అస్తమానం కాలక్షేపం చేస్తూ వుంటే, ఒక తరం నుంచి మరో తరానికి ఈ జ్ఞానం, వివేకం మార్పిడి ప్రక్రియ జరగదు.