లాలాజీ మహరాజ్ చాలా ఎక్కువగా ఇష్టపడేవారు. మీరు కనుక లాలాజీ మహరాజ్ సంపూర్ణ రచనలు, రెండవ సంపుటి కనుక చదివి ఉంటే అందులో వారు ఇలా అన్నారు. ‘హనుమాన్’ అనే పేరు ఎలా వచ్చిందో ఆయన అందులో చెప్పారు. అది తర్వాత కూడా పెట్టి ఉండొచ్చు. మహాభారతంలో కూడా, ఏ తల్లి తన పిల్లలకు దుష్టయుద్ధ్ ‘దుర్యోధనుడు’ అని పేరు పెడుతుంది? ధృత్ రాష్ట్ర… అలా. ఆ పాత్ర గుణాలను వర్ణించే క్రమంలో, ఆ వ్యక్తి స్వభావాన్ని ప్రతిబింబిస్తూ, తదనంతరం వారికీ పేర్లు పెట్టి ఉండవచ్చు. హనుమాన్ యొక్క అత్యున్నత గుణం, లాలాజీ వర్ణించినట్లు, ‘హను’ అంటే అతీతంగా/లేకుండా… ‘మాన్’ అంటే మానావమానములకు అతీతంగా ఉండేవాడే హనుమంతుడు. వారి మానసిక స్థితి ఎలాంటిదంటే, మానావమానములకు అతీతంగా అంటే పూర్తి సమర్పణా భావం, వినమ్రతా స్థితి. దీన్నే బాబూజీ మహరాజ్ పార్సీ భాషలో ‘అభూదియాత్’ అని పేర్కొనేవారు.
అప్రాధాన్యమైన స్థితి! ఆయనే సర్వస్వం, ‘నేను’ అనే భావన అస్సలు లేని స్థితి. ఆ భావన ఎప్పుడు కలుగుతుందంటే…. అభ్యాసీ తొమ్మిదో చక్రాన్ని చేరుకున్నప్పుడు అక్కడి సంపూర్ణ స్థితిని అనుభూతి చెందినప్పుడు కలుగుతుంది. ‘అనంతం వైపు’ అనే తన పుస్తకంలో బాబూజీ దీన్ని ప్రస్తావించారు. అది హనుమంతుల వారి మనోస్థితి. అది మనలో పెంపొందించుకోవాలి. ఒక అభ్యాసీతో బాబూజీ దీని గురించి కొంత చర్చించారు కూడా! ఆయన ఏమన్నారో సోదరుడు సంజయ్ ను యధాతధంగా మీకు వివరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఒక్క అంగలో పూర్తి దూరాన్ని అధిగమించడం గురించి అడిగిన ఒక అభ్యాసీతో బాబూజీ, హనుమంతుడి ఉదాహరణను ఇలా గుర్తు చేశారు. సముద్రాన్ని ఒక్క అంగతో హనుమంతుడు లంఘించడం గురించి చెబుతూ…. దీనికి కావలసిన మొదటి ఆవశ్యకత, ఆయన ఎల్లప్పుడూ తనను తాను మర్చిపోయే స్థితిలోనే ‘స్వీయ మైమరపు’ లోనే ఉంటారు. రెండో ఆవశ్యకత, తన యజమాని నుండి వచ్చే ఏ ఆదేశాన్నైనా అమలు జరిపే ఆలోచనలోనే నిమగ్నమవుతారు. ఆయన దృష్టిలో లక్ష్యం మాత్రమే ఉంటుంది తప్ప దారిలో ఎదురయ్యే అవరోధాల గురించి గానీ దూరాభారాన్ని గానీ అస్సలు లెక్కచేయరు. మనం కూడా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని అటువంటి స్వీయమైమరపుని మనలో సృష్టించుకోగలిగితే… అంతటి దూరాన్ని మనమూ ఒక్క గంతులో అధిగమించవచ్చు. హనుమంతుల వారి లక్ష్యం తల్లి సీతాదేవి. అలాగే అభ్యాసులకు లక్ష్యం మన మాస్టర్ లేదా ఆధ్యాత్మిక జనని. దీనికి కావలసిన అత్యున్నత గుణాలు రెండు. ఒకటి, నేను నా మాస్టర్ తో అనుసంధానమై ఉన్నంతవరకు ఎటువంటి తప్పూ జరగదనే అపారమైన ధైర్యం. రెండవది వినమ్రత. హనుమాన్ లా ఎలా తయారవ్వాలి? వారి అత్యున్నత లక్షణాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మన ఆది గురువులు చెప్పినట్లు, హనుమాన్… హను అంటే అతీతంగా… మాన్ అంటే – ఈ గౌరవం, స్వాభిమానం వేటికోసమైతే నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తపన పడతారో… అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. జీవితంలో తన అస్తిత్వాన్ని, పూర్తి సమర్పణా భావంతో, ఎటువంటి ప్రాముఖ్యతా లేకుండా జీవించగలగడం. అత్యున్నత వినమ్రతా భావం! ‘నేను కేవలం నా ప్రభువు సేవకుడిని’, అనే భావంతో అందరికీ సేవ చేయడం. కుటుంబంతో ప్రారంభించి దేశానికి అనంతరం ప్రపంచానికి సేవలందించడం. వ్యక్తులుగా మన కర్తవ్యం, విధించడం కాదు, గ్రహించడం.