ప్రశ్న: దాజీ! మృత్యువు ఆసన్నమైనప్పుడు మనం ఎలా తయారుగా ఉండాలి?
Q:How do we get ready, when Death occurs, Daaji?
ముందుగా మనం వెళ్ళిపోతున్న విషయం మనకు తెలియాలి.
చాలామందికి ఇది ఎప్పుడనేది తెలియదు.
కాబట్టి మనం ఎల్లప్పుడూ తయారుగా ఉండాలి.
భగవంతుడు ఎప్పుడు పిలుస్తారో ఎవరికి తెలుసు?
ఎలా తయారుగా ఉండాలంటే…
ఉదాహరణకు భగవంతుడు ఒక వారం తర్వాత
పికప్ చేసుకుంటానని చెప్తే, మీరేం చేస్తారు?
అదే ఒక గంట సమయం ఇస్తే అప్పుడేం చేస్తారు?
ఆధ్యాత్మిక సాధన మనల్ని ఎల్లప్పుడూ తయారుగా ఉండేందుకు సిద్ధం చేస్తుంది.
ఇది స్కూల్ లేదా కాలేజీ పరీక్షల్లా ఉండదు.
సంవత్సరం పొడుగునా క్లాసుకు అటెండ్ అవ్వకపోయినా, పరీక్షకు కొద్దిసేపటి ముందు బాగా చదివి, అదృష్టం ఉంటే పాస్ అవడం… అలా ఉండదు.
లేదా పేరు ప్రతిష్టలతో, డబ్బుతో ప్రశ్నాపత్రాన్ని ముందుగానే తెప్పించుకొని,
జవాబులను బట్టీపట్టి, వ్రాసి పాస్ అయిపోవడం…
మృత్యువు అలా ఉండదు.
నా ఆధ్యాత్మికస్థితి ననుసరించి, మృత్యువు అరుదెంచినప్పుడు దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్లే క్రమంలో…
అది తనకు సరిపోలే పరిమాణం లేదా డైమన్షన్ కు తగ్గ ప్రదేశానికి చేరుకుంటుంది.
అటువంటి స్వచ్ఛమైన ప్రకంపనా స్థాయిని నేను చివరి నిమిషంలో చిటికె వేసినట్లు పొందలేను.
ఏడవ, ఎనిమిదవ డైమన్షన్ లాంటి ఆ స్థాయిలను అప్పటికప్పుడు పొందలేం. అలా జరగదు.
దీనికి ముందునుంచే సిద్ధమవ్వాలి.
అనునిత్యం సిద్ధమవడం అంటే వినడానికి ఏదో రోగిష్టి వ్యవహారంలా ఉంటుంది. తెలియని భయం ఆవరిస్తుంది.
కానీ హృదయాంతరాళంలో మన పనులన్నీ నిబద్ధతతో పూర్తి చేయడమే మనం చేయవలసింది.
మొత్తానికి ఇదే కీలకం!
నేనేదీ అసంపూర్తిగా వదలకూడదు.
సగం సగం చేసిన పనులు మనల్ని నిద్రలో కూడా వెంటాడతాయి.
పరీక్షల్లో పెన్సిల్ మర్చిపోయినట్లు కలలెప్పుడైనా వచ్చాయా?
లేదా విమానాన్ని అందుకోలేక పోయినట్లు.
మీరు మ్యాథ్స్ పరీక్షకు వెళ్ళాకా పెన్సిల్, పెన్, రబ్బర్ ఇలాంటివి తీసుకెళ్లడం మర్చిపోయి బాగా భయపడి పోయినట్లు…
ఇలాంటివి. అసంపూర్తిగా చేసిన పనులకు ఇవన్నీ ప్రతీకలు.
కుటుంబంలో కూడా, తండ్రి ఏదో చెప్తారు… మీరు చేయరు.
అలాగే తల్లి చెప్పింది కూడా చేయరు.
ఇలా పూర్తి చేయని పనులన్నీ మన లోపల పోగు పడతాయి.
చాలా పనులు మనం కనీసం చర్చించము కూడా!
ఇవన్నీ మన చైతన్యంలో నిక్షిప్తమై ఉంటాయి.
ఇతరులకు తెలియక పోవచ్చు కానీ, పూర్తి చేయలేదనే గ్రహింపు, స్పృహ నాకెల్లప్పుడూ ఉంటుంది.
కాబట్టి ఈ పూర్తి చేయని పనుల భారాన్నంతా మనం మోస్తూంటాం.
ఇదంతా ఎంతో వేదనతో కూడి ఉంటుంది.
నిజానికి భగవాన్ శ్రీకృష్ణుడు ఈ కర్మ గురించే ఎంతో చెప్పారు.
మనపై గత కర్మల భారం, ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
వీటి గురించి ఎంతో చింతిస్తూంటాం కూడా.
అందులో తప్పేమీ లేదు.
మనం చెయ్యని పనులపై దృష్టి పెట్టం.
ఈ జడత్వం వల్లే మనం పనులు పూర్తి చేయలేకపోవడం.
చేయవలసిన పని నేను చేయలేకపోవడం,
దీన్నే జడత్వం అంటాం.
నేను కారులో ప్రయాణిస్తూ,
ఒక వ్యక్తి రోడ్డుపై పడి ఉండడం చూశాననుకోండి.
ఆ రోజు సాయంత్రానికి ఫలానా చౌరస్తాలో కిందపడ్డ వ్యక్తి
చనిపోయారని నేను వార్తలలో విన్నాననుకోండి.
అదే అతను పడి ఉండటం నేను చూసినప్పుడే క్రిందకు దిగితే,
అతనిని లేదా ఆమెను హాస్పిటల్లో చేర్చడంలో సహాయపడే అవకాశం ఉండేది.
అలాగే మీరు ఒక డాక్టరయ్యి, హాస్పిటల్ లో
రోగులను చూస్తూ రౌండ్స్ లో ఉన్నప్పుడు…
ఒక పేషెంట్ మిమ్మల్ని నా గుండె పరీక్షించండి,
ఏదో అవుతోందని కంగారుగా పిలిచినప్పుడు…
మీరు వేరెవర్నో కలవాలి… దయచేసి కాసేపు ఉండండి అని చెప్పి,
ఒకవేళ మీరు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి చనిపోతే, ఎలా ఉంటుంది?
మనం చేయాల్సిన పనిని
వాయిదా వేయటమూ ఒక సమస్యే.
నేను చెప్పదలుచుకున్నది, కొన్ని చేయని పనులూ మన హృదయంపై
గాఢమైన ముద్రను వేస్తాయి. అపరాధ భావనను కలుగజేస్తాయి.
వేరే చర్యలేవీ కలుగజేయని ప్రభావాన్ని,
ఇవి మీ హృదయంపై కలుగజేస్తాయి.
మీరు ఒకవేళ ఆ పని సక్రమంగా చేయకపోయినా,
అసలు చేయని దానికంటే అది మేలు.
ఎవరో పడిపోయారు.
మీరు స్పందించి సహాయం చేయబోతారు.
కానీ ఈ లోపునే ఏదో జరిగిపోతుంది.
అసలేమీ చేయకపోవడం కన్నా, ఇది కొంతవరకూ మెరుగే కదా!