సంతుష్టికి దారితీసే సాధనలు
సంతుష్టి, సంతోషాలకు దారితీసే సాధనలు
కోరికలు, కాంక్షలతో మనకుండే అనురాగాన్ని తొలగించుకున్నప్పుడే మన అంతరంగలో ఆవశ్యకమయిన స్వీకారం (యాక్సెప్టెన్స్), సంతృప్తి లేదా సంతుష్టి (కంటెంట్మెంట్) లను సృష్టించుకోగలమని క్రిందటి ఎపిసోడ్ లో తెలుసుకున్నాము.
అయితే ఇదెలా సాధ్యం?
హార్ట్ఫుల్నెస్ విధానంలో ఇది సహజంగా ఆచరణీయమైన, పరిపూరకమైన పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది. ఇవి నాలుగు ఉన్నాయి.
మొదటిది, ధ్యానం. ఈ సాధన ద్వారా ఆలోచనల ఆకర్షణను అలక్ష్యం చేయడం నేర్చుకుంటాం. అవి ఇక ఎంతమాత్రమూ మనలను అన్యమనస్కం చేయలేవు.
మన ఆలోచనా ప్రక్రియ మీద ఆధిపత్యం పొందుతాం. మరింత లోతుగా హృదయంలోకి ధ్యానంలో ప్రవేశిస్తుండగా, హృదయంలోని భావోద్వేగాల, అనుభూతుల ఆకర్షణలను కూడా అలక్ష్యం చేయగలుగుతాం.
జీవితంలోని ఆటుపోట్లకు ప్రతిచార్యాత్మకంగా స్పందించే ముందు కాస్త ఆగడం(పాజ్) నేర్చుకుంటాం. నిశ్చలత, అంతరాళంలో సంచరించడం మనకు సుఖప్రదమనిపిస్తుంది.
ప్రాణాహుతి ప్రసారం ఉత్ప్రేరకంగా దీన్ని సంభవింప చేస్తుంది.
రెండవది నిర్మలీకరణ: మన లోపల, అంతఃచేతనలో పాతుకు పోయిన ముద్రలు – అవే సంస్కారాలుగా మనకు పరిచయం – ఇవి మన కోరికలకు కొక్కెంలా పని చేసి పోషిస్తుంటాయి. వాటిని, ప్రతిదినం మన నిర్మలీకరణ ప్రక్రియ ద్వారా తొలగించుకుంటాం. తరచూ మన కోరికలకు మూలం అంతఃచేతనలో – మన ఎరుకకు అందని స్థితిలో – దాగి ఉంటుంది; దానిని మనం చైతన్య స్థాయిలో నిర్మూలించుకోలేము. నిర్మలీకరణ ప్రక్రియ ఈ మూలాలను తొలగిస్తుంది.
మూడవది, ప్రార్థన: రాత్రి పడుకోబోయే ముందు మనం మన హృదయాన్ని తెరచి కేంద్రంతో అనుసంధానం అవుతాం; మనకోరికలు, కాంక్షలు మనకు ఏవిధంగా అడ్డుతగులుతున్నాయో సమర్పించుకుంటాం. వాటిని తొలగించడం కోసం సహాయాన్ని అర్థిస్తాం
చివరగా, నిరంతరస్మరణ: ఇది ముద్రలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. మన చైతన్య స్వచ్ఛతను ఆ విధంగా సంరక్షించడం జరుగుతుంది. అప్పుడు మనం అన్ని పరిస్థిలలోనూ సంతుష్టిగా ఉంటూ మనతో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం.
ధ్యానంలో మనం సంపూర్ణమైన సమతుల్యం, అంటే సమాధి స్థితిని అనుభూతి చెందినప్పుడు, అది మన మిగతా కార్యకలాపాలన్నింటిలో నిరంతరస్మరణగా ప్రకాశిస్తుంది. లౌకిక జీవనం నిరాశాజనకంగా ఉన్నప్పటికీకూడా, అప్పుడు ఆనందం సహజసిద్ధంగానే కలుగుతుంది. మనం మన కేంద్రంలో నిశ్చలంగా ఉంటాం. నిత్యం మన మనుగడలో ఇటువంటి సమాధి స్థితులను పొందుతూ వాటిని శాశ్వతం చేసుకుంటాం. హార్ట్ఫుల్నెస్ సాధనా పద్దతి అందించేది ఈ అద్భుతాన్నే.
హృదయమే మన నిర్దేశం
మనం సంతోషంగా, సమతుల్యంగా ఉన్నప్పుడు సాధారణంగా హృదయం ఏమీ అనదు. ఎటువంటి సంకేతమూ ఇవ్వదు. మనం మంచి ఎంపికలు చేసుకున్నప్పుడల్లా మన నిర్ణయాలకు హృదయం మౌన సాక్షిగా ఉండిపోతుంది. సహజమైన సంతుష్టి కలిగింది.
మనతో మనం సంతోషంగా లేనప్పుడు మన హృదయం అస్థిరంగా నిలకడ లేకుండా ఉంటుంది. చంచలమౌతుంది. మనలో ఏదో మార్చుకోవలసిన అవసరం ఉందనే హెచ్చరిక అది. మనం ఇక్కడ హృదయాన్ని వినడం నేర్చుకుంటాం, మనకు మార్గ నిర్దేశం చేయనిస్తాం.
(పటం)
ఆవిధంగా మనం ఎప్పుడైతే వర్తమానంలో జీవించడం నేర్చుకుంటామో అప్పుడు మనం దివ్యత్వసారం అయిన వాస్తవంలో జీవిస్తునట్లు.
ప్రార్థన, ధ్యానం, ఆత్మ పరిశీలనతో మనం మరింత లోతుగా మన భావనల ప్రపంచం లోనికి, హృదయ చైతన్య క్షేత్రంలోనికీ అడుగు పెడతాం. చివరకు మనం మొదటి చక్రం యొక్క కోరిక, సంతృప్తి అనే ద్వంద్వ భావోద్వేగాల హరివిల్లుపై ఆధిపత్యం సాధిస్తాం. ఆవిధంగా మనం లక్ష్యసిద్ధి కోసం తపన, సంతృప్తి ఈ రెండిటినీ సమైక్యం చేస్తాం. అంటే చలనం, నిశ్చలత రెండూ కలిసి కొనసాగుతాయి.
సంతుష్టి – తటస్థత
సంభవిస్తున్న ప్రతి దానికి సంపూర్ణం, సహజమైన స్వీకార స్థితి ఉండడానినే సంతుష్టి అంటారు. సంతృప్తి అన్నది మొదటి మెట్టు, దానిని స్వీకరించి అచ్చట నుండి ముందుకు సాగుతాం, అవసరమైతే మార్పుకు నాంది పలుకుతాం కూడా.
ఒక యోగి సహజ సిద్ధమైన స్థితి ఈ స్థాయికి చెందిన సంతృప్తి. యోగి ఎంత సంతుష్టుడైతే అంత ఎక్కువగా అతడు ఇతరులకు ఆనందం, ప్రశాంతత ప్రవహింప చేయగలడు మనలో ఎక్కువ, మరింత ఎక్కువమంది అంతర్గత సంతృప్తిని ప్రవహింప చేస్తూ ఉంటే, మనం సృష్టించే వాతావరణం మానవజాతినంతటనీ పరిణామం చెందించగలదు.
https://cdn-prod.heartfulness.org/e-magazines/telugu/HFN_MAG_AUG21_TELUGU.pdf