ధ్యానం అంటే ఏమిటి? అని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ధ్యానం అంటే ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయడం. దీనికి సమానమైన సంస్కృత పదం ‘ధ్యాన్’ విభిన్నమైన అర్ధాన్ని కలిగి ఉంటుంది.
ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటానికి, దీనికి ఏమీ సంబంధం లేదు. ధ్యాన్ అంటే మనసును, హృదయాన్ని ఉపయోగించి మనసును అధిగమించటం. ఒకే ఆలోచనపై మనసును లగ్నం చేయటం అనే మొదటి నిర్వచనం తీసుకుంటే అప్పుడు ముందుగా ప్రణాళిక ప్రకారం హత్యలు చేసే హంతకుడు… అతని చర్యలు కూడా ధ్యానం గానే పరిగణించవలసి వస్తుంది. కానీ మనం దాన్ని అలా పిలవం. ఈ తేడాను గమనించండి.
ఆక్స్ ఫర్డ్ ప్రకారం మనసును ఒకే విషయంపై లగ్నం చేయటం ధ్యానం. కానీ మన భారతీయ సంప్రదాయంలో నిజమైన ధ్యానం అంటే మన మనసును అధిగమించటం కాబట్టి కేంద్రీకరించటం అనేది విషయం కాదు.
కానీ మనం దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యాన్ని…. మంచి చెడుల విచక్షణా జ్ఞానాన్ని, కారణానికి, ప్రభావానికి గల సంబంధాన్ని… ఏది చట్టపరంగా తప్పైనా, నైతికంగా ఒప్పో ఇలాంటివి… జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం చట్టపరంగా తప్పు అయినప్పటికీ నైతిక పరంగా అది కచ్చితంగా ఒప్పు అయి ఉండవచ్చు. అది అత్యుత్తమమైన చట్టం. మనం దీన్ని ముందుగా అనుసరించాలి. మీరు చట్టాన్ని ఉల్లంఘించటం వలన మూల్యం చెల్లించాల్సి
వచ్చినా కూడా నైతికతనే అనుసరించాలి. మీరు శిక్షను అనుభవించటానికి ధైర్యం, బలం కలిగి ఉండాలి. కాబట్టి నైతికత చాలావాటిని కోరుతుంది. ధ్యానం మనకు ఖచ్చితమైన స్పష్టతను కలగజేస్తుంది. ధ్యానం చేసినట్లయితే
వారి అంతర్దృష్టి (సహజ జ్ఞానం) ఆకాశమంతగా పెంపొందుతుంది. ఇంతకు ముందు నేను బుద్ధి యొక్క ఐదు స్థాయిల గురించి మాట్లాడటం జరిగింది. దీనిలో అత్యున్నతమైనది ఈ సహజ జ్ఞానం.. ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ లాయర్,
డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపిస్తుంటారో… వారు నోరు విప్పక ముందే, సహజ జ్ఞానం గల జడ్జి గారు ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనేది చెప్పగలరు. అదీ ధ్యానం యొక్క శక్తి. ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని సాధన చేసి, వారి అంతర్దృష్టి ఏవిధంగా పెంపొందుతుందో గమనించాలని నేను కోరుకుంటున్నాను., తరువాత, అతిధులతో విందు సమయంలో ‘బ్రైటర్ మైండ్స్’ ప్రదర్శన ద్వారా… కొద్ది వారాల ధ్యానం సైతం పిల్లల మనసును ఏ విధంగా మార్చగలదో మీకు చూపిస్తాను. దీని గురించి మీలో చాలామందికి తెలుసు. అయితే మన బ్రైటర్ మైండ్స్ క్లాసెస్ తెలియని వారి కోసం, ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.