తీపి చిన్నారి చిరునవ్వు చెదరకుండ
- చదువు నేర్పించు గురువుల ఆలయమ్ము
సంయమన మను ఉప్పుతో సమము చేయ – ఆత్మనిర్భర మైనట్టి వసతి వన్నె
పులుపు కారాల పొగరుల యువత పొంగు – - పట్టి, పోటీల మళ్ళించు ఆట భూమి
చేదు వగరుల ఆసన యోగములను –
స్వస్థ తిచ్చెడి ప్రకృతి వైద్య శాల
వేద, విజ్ఞాన సూత్రాల సహజ రీతి
అన్ని జాతుల మతముల బంధులెల్ల
కలసి ఒక్కటై ధ్యానించు మందిరమ్ము
బ్రహ్మజ్ఞానము నందరికి అందజేయు
అందరికీ శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
వ్యాఖ్యాత: శ్రీ వోలేటి శ్రీనివాస భాను
సంగీతం, గానం: Dr M R K ప్రభాకర రావు
వాద్య సహకారం: శ్రీ S బ్రహ్మానందం